Weekly News

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకోవడం లో ముందుండాలి :విశాఖ లో జాతీయ ఈ-గవర్ననెన్స్ లో చంద్రబాబు

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకోవడం లో ముందుండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ లో జరుగుతున్న 20వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో అన్నారు.ఇప్పుడు వేలి ముద్ర ఉంటే అన్ని లావాదేవీలు చెయ్యొచ్చు అని అన్నారు.ఇప్పటికీ మనం బ్రిటిష్ విధానాన్నే అవలంబిస్తున్నామని,డిజిటలైజేషన్ లోకి అందరూ మారుతున్నారని అన్నారు. కార్యక్రమం లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు,సుజనా చౌదరి రాష్ట్ర మంత్రులు గంటా, పల్లె, అయ్య
పూర్తి వివరాలు..

నోట్ల రద్దు వల్ల ఇబ్బందులున్నా వసూళ్లు పెరిగాయి: అరుణ్‌జైట్లీ

నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ పన్ను వసూళ్లు పెరిగాయని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 2016 ఏప్రిల్-నవంబర్ కాలంలో ప్రత్యక్ష పన్నులు 12.01%, పరోక్ష పన్నులు 25% పెరిగినట్లు తెలిపారు. సర్వీస్, కస్టమ్ డ్యూటీ, సెంట్రల్ ఎక్స్ఛేంజ్ ట్యాక్స్ వసూళ్లు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. పన్నువసూళ్లు తగ్గిపోతాయంటూ భయాందోళనలు సృష్టించిన రిపోర్టులు, గణాంకాలను ఆయన కొట్టిపారేశారు.
పూర్తి వివరాలు..

భీమ్ యాప్‌కు అపూర్వ స్పందన

నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన భీమ్ యాప్‌ దూసుకెళ్తోంది. కేవలం 10 రోజుల వ్యవధిలో 10 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు మోదీ తెలిపారు. ప్రజలు నగదు రహిత లావాదేవీ పట్ల మొగ్గు చూపుతున్నారనే దానికి భీమ్‌ యాప్‌ నిదర్శనమన్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియాకు ఇదొక చక్కని ఉదాహరణ, ప్రజలు సాంకేతికతను స్వాగతిస్తున్నారని దీని వల్ల అర్థమవుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.
పూర్తి వివరాలు..

50,000 కోట్లు ఏమైనట్టు ?

పార్లమెంటరీ కమిటీకి ఉర్జిత అందజేసిన వివరాల ప్రకారం... రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో ఆర్‌బిఐ 9.2 లక్షల కోట్ల రూపాయల కొత్త కరెన్సీ విడుదల చేసింది. ఆర్‌బిఐ రెగ్యులర్‌గా విడుదల చేసే డేటా ప్రకారం ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ విలువనే 9.5 లక్షల కోట్ల రూపాయలు. చలామణిలో ఉన్న కరెన్సీలో రద్దు కాకుండా ఉన్న చిన్న నోట్లు కూడా ఉంటాయి. చలామణిలో కొనసాగుతున్న ఈ చిన్న నోట్ల విలువ 2.53 లక్షల కోట్ల రూపాయలు.
పూర్తి వివరాలు..

అగ్ర‌కులాల ఊచ‌కోత కేసులో న‌లుగురికి క్ష‌మాభిక్ష‌.. మ‌ర‌ణ‌శిక్ష‌ను యావ‌జ్జీవ శిక్ష‌గా మార్చిన రాష్ట్ర‌ప‌తి

మ‌ర‌ణ‌శిక్ష ప‌డిన న‌లుగురు దోషుల‌కు రాష్ట్ర‌ప‌తి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించారు. 1992లో బీహారులో అగ్ర‌కులాల‌కు చెందిన‌ 34 మంది ఊచ‌కోత‌కు గుర‌య్యారు. ఈ కేసులో కృష్ణ‌మోచీ, న‌న్హేలాల్ మోచీ, బిర్ కుమెర్ పాశ్వాన్‌, ధ‌రుసింగ్‌ల‌ను దోషులుగా నిర్ధారించిన కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించింది. అయితే దోషుల‌కు క్ష‌మాభిక్ష ప్ర‌సాదించవద్దంటూ హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర‌పతికి సిఫార్సు చేసింది. హోంమంత్రిత్వ శాఖ సిఫార్సును త
పూర్తి వివరాలు..

ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక గాంధీ

మహిళలపై బీజేపీ నాయకుల వైఖరికి ఎంపీ వినయ్ కతియార్ వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయని ప్రియాంకా గాంధీ అన్నారు. అంతకుముందు ఎంపీ వినయ్ కతియార్ తమ పార్టీలో స్మృతి ఇరానీ ఉన్నారని, ప్రియాంక కంటే ఆమె అందమైన మహిళ అని, ఆమె బాగా మాట్లాడతారు కూడా అని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పూర్తి వివరాలు..

టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి: రాష్ట్రపతి

దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలనుద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి.. ప్రజాస్వామ్య దేశంలో అందరూ సహనం, ఓర్పు, గౌరవం, విలువలు కలిగి ఉండాలన్నారు. అటు ఆర్థికంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్న ఆయన.. నగదు రహిత లావాదేవీలతో వృద్ధిలో పారదర్శకత ఉంటుందన్నారు. నోట్లరద్దుతో ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం కొంతకాలమేనన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని సూచించారు.
పూర్తి వివరాలు..

ప్రొటోకాల్‌ పక్కన పెట్టిన ప్రధాని

దిల్లీ: ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తన ప్రొటోకాల్‌ను పక్కన పెట్టారు. రాజ్‌పథ్‌లో గురువారం జరిగిన 68వ గణతంత్ర వేడుకలకు హాజరైన మోదీ మైదానంలో ప్రజలకు చాలా దగ్గరగా నడుస్తూ వారికి అభివాదం చేస్తూ కనిపించారు. ఆయన ప్రొటోకాల్‌ను పక్కన పెట్టడం ఇది రెండో సారి. గతేడాది గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఇదేవిధంగా చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు. రాజ్‌పథ్‌
పూర్తి వివరాలు..

తక్కువ సమయంలో ఏపీకి ఎక్కువ ప్రాజెక్టులు.. పథకాలు.. నిధులు ఇచ్చాం బీచ్‌కు ఎవరొస్తారో.. ఏం కోరతారో చూద్దాం ప్రత్యేక హోదా ఉద్యమంపై కేంద్ర మంత్రి వెంకయ్య

న్యూఢిల్లీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో పరిశ్రమలు, పెట్టుబడుల కోసం జరుగుతున్న భాగస్వామ్య సదస్సు చాలా ప్రతిష్టాత్మకమైనదని, ప్రజలంతా మద్దతు తెలపాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కోరారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలో శాంతియుత ఉద్యమం చేపట్టాలని యువ త సిద్ధమవుతోందని ప్రస్తావించగా.. గణతంత్ర దినోత్సవాన్ని యువత జాతీయ భావంతో, క్రమశిక్షణతో జరుపుకుంటారని ఆశిస్తున్నానన్నారు.
పూర్తి వివరాలు..

ఆంధ్రప్రదేశ్ మరో రికార్డును సాధించింది

పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో 42 శాతం అమల్లోకి రావడమే కాకుండా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి దేశంలో మొదటి స్థానానికి చేరింది. భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాలేవీ అమలులోకి రావడం లేదన్నవిపక్షాల విమర్శలకు ఏపీ ప్రభుత్వం గణాంకాలతో సూటిగా సమాధానం చెప్పింది. దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో సాధించలేనన్ని పరిశ్రమలను గత ఏడాది ఆంధ్రప్రదేశ్ సాధించింది.ఈ విషయంలో గుజరాత్‌ను కూడా ఏ
పూర్తి వివరాలు..

111కోట్ల మందికి ఆధార్: రవిశంకర్

డిజిటల్ చెల్లింపుల కోసం తీసుకొచ్చిన భీమ్ యాప్‌ను ఆధార్‌కు అనుసంధానిస్తున్నామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు 4.47కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌కు అనుసంధానం చేశామన్న ఆయన.. నెల రోజుల్లో మరో 2కోట్ల ఖాతాలు అనుసంధానిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆధార్ ద్వారా రూ.167.3కోట్ల మేర చెల్లింపులు జరిగాయన్న మంత్రి.. దేశంలో 111కోట్ల మంది ఆధార్ నమోదు చేసుకున్నారని తెలిపారు.
పూర్తి వివరాలు..

పంజాబ్ సీఎం అభ్యర్థిగా అమరేందర్ సింగ్

పంజాబ్ సీఎం అభ్యర్థి కెప్టెన్ అమరేందర్ సింగేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. మజితలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. బాదల్ ప్రభుత్వం పంజాబ్ భవిష్యత్‌ను నిర్వీర్యం చేసిందన్నారు. గతంలో దేశానికి అన్నం పెట్టిన పంజాబ్‌ను బాదల్ కుటుంబసభ్యులు దోచుకుంటున్నారని విమర్శించిన రాహుల్.. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించి, ప్రజలను రుణవిముక్తి చేస్తామన్నారు.
పూర్తి వివరాలు..

అవకాశాలున్నాయి.. అందుకోండి: చంద్రబాబు

పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అపార వనరులు ఉన్నాయని.. పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు విశాఖ సీఐఐ సదస్సులో పేర్కొన్నారు. దేశంలోనే ఉత్తమమైన నగరాల్లో విశాఖ ఒక్కటన్న సీఎం.. ప్రపంచంలోనే మెరుగైన రాజధానిగా అమరావతిని రూపొందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఉత్తమమైన నాయకత్వం ఉందని.. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని బాబు తెలిపారు
పూర్తి వివరాలు..

ఉత్తర ప్రదేశ్ లో BJP హవా

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఎగ్జిట్స్ పోల్స్ అంచనాలకు తగినట్టే బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో  బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. యూపీలో మొత్తం 403 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ 232 చోట్ల ఆధిక్యంలో ఉంది. అధికార సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి 75, బీఎస్పీ
పూర్తి వివరాలు..

భాజపా రిగ్గింగ్ కు పాల్పడింది:మాయావతి

భాజపా రిగ్గింగ్‌కు పాల్పడిందని బహుజన్‌ సమాజ్‌పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. శనివారం లఖ్‌నవూలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘ముస్లింల మెజారిటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలూ భాజపా ఖాతాలోకి చేరాయి. ముస్లింలు ఎన్నటికీ భాజపాకు ఓటు వేయరు. ప్రజలు ఎవరికి ఓటు వేసినా భాజపాకు వెళ్లడమో లేదా భాజపాకు కాకుండా వేరే పార్టీలకు ఓటు వేస్తే ఈవీఎంలు తీసుకోకపోవడమో జరిగింది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు
పూర్తి వివరాలు..

నరేంద్ర మోడి దేవుడు కాదు:దిగ్విజయ్

ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకం కావాలని కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. మతమౌఢ్యాన్ని వ్యతిరేకించే పార్టీలన్నీ చేతులు కలపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ‘నరేంద్ర మోదీ దేవుడు కాదు. ఆయనను ఆపాల్సిన అవసరముంది. మతతత్వ శక్తులను వ్యతిరేకించే పార్టీలన్నీ ఐక్యం కావాల్సిన అవసరముంద’ని దిగ్విజయ్ అన్నారు. గోవాలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వజీత్ రాణె రాజీనామాపై
పూర్తి వివరాలు..

ప్రధాని మోదీని ఓడించాలంటే..?

న్యూఢిల్లీ: బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే అడ్డుకోలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ అన్నారు. మహాకూటమితోనే బీజేపీ, మోదీని ఎదుర్కొగలరని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ ఒక్కటే బీజేపీని ఓడించగలదని అనుకోవడం మూర్ఖత్వమన్నారు. కలిసికట్టుగా పోరాడితే 2019లో బీజేపీపై విజయం సాధించే అవకాశాలున్నాయని చెప్పారు. ‘సీట్ల పరంగా చూసుకుంటే కాంగ్రెస్‌కు చాలాపెద
పూర్తి వివరాలు..

సీనియర్ బిజెపి నేత తో సిక్కోలు ఎమ్.పి ముచ్చట్లు

పార్లమెంట్ ఆవరణలో BJP సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తో సిక్కోలు MP కింజరాపు రామ్మోహననాయుడు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎర్రంనాయుడు తో తనకున్న అనుబంధం జోషి గుర్తు చేసారు.
పూర్తి వివరాలు..