Weekly News

ఆట మొదలైంది.. విజయం మాదే..

చండీగఢ్‌: పంజాబ్, గోవా ఎన్నికల్లో తమదే విజయమని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పునరుద్ఘాటించారు. ఆట మొదలైంది.. పంజాబ్, గోవాల్లోని అధికార పార్టీలకు పతనం ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్‌ కమిషన్‌ (ఈసీ) నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 4న జరగబోయే పంజాబ్,
పూర్తి వివరాలు..

కేసీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చింది. అసెంబ్లీ రూల్ 168 కింద నోటీసును స్పీకర్‌కు అందించింది. ప్రతి నెలా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు చెల్లిస్తామని సీఎం గతంలో సభలో చెప్పారని, ఈ నెల 4న ఇదే అంశంపై మాట్లాడుతూ వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ సాధ్యం కాదని చెప్పారన్నారు. ఒకే అంశంపై రెండు రకాలుగా సమాధానం చెప్పి సభను పక్కదారి పట్టించారని కాంగ్రెస్ నోటీసులో పేర్కొంది.
పూర్తి వివరాలు..

నమ్మకాన్ని వమ్ముచేయను: చంద్రబాబు

గోదావరి జిల్లాల ప్రజలు తనపై విపరీతంగా నమ్మకం పెట్టుకున్నారని.. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తానే గాడిలో పెట్టగలనని భావించారని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాంటి వారి ఆశలను వమ్ముచేయనని.. గోదావరి జిల్లా ప్రజలకు నీళ్లిచ్చిన తర్వాతే మిగతా ప్రాంతాలకు తీసుకెళ్తామన్నారు. ఇక్కడి నీళ్లు తరలించుకెళ్తున్నారని, గోదావరి జిల్లాలు ఎడారిగా మారుతాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను నమ్మవద్దని ప్రజలను బాబు కోరారు.
పూర్తి వివరాలు..

నితీష్‌ని పొగిడిన మోదీ

రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించిన బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను ప్రధాని మోదీ అభినందించారు. గురుగోబింద్ సింగ్ జయంతి సందర్భంగా పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. మద్య నిషేధంలో బీహార్‌ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా రాజకీయంగా ప్రత్యర్థులైన మోదీ, నితీష్ ఒకేవేదికపై ఆశీనులయ్యారు. అటు నోట్ల రద్దుని నితీష్ సమర్థించడం తెలిసిందే.
పూర్తి వివరాలు..

మా వల్లే దావూద్ ఆస్తులు సీజ్: BJP

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ.15వేల కోట్ల విలువైన ఆస్తులను UAE ప్రభుత్వం సీజ్ చేయడానికి తామే కారణమని BJP ట్వీట్ చేసింది. ఇది మోదీ సాధించిన విజయమని.. భారత్ పక్కాగా సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగానే UAE ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొంది. కాగా 1993లో ముంబైలో వరుస పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన దావూద్‌ను పట్టుకునేందుకు భారత్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలు..

17నుంచి బాబు దావోస్ పర్యటన

ఈ నెల 17నుంచి 21వరకు ఏపీ సీఎం చంద్రబాబు దావోస్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ సమావేశంలో బాబు పాల్గొననున్నారు. అలాగే నవ్యాంధ్రలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అక్కడి పారిశ్రామికవేత్తలకు సీఎం వివరించనున్నారు. బాబు వెంట పలువురు మంత్రులు, అధికారులు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలు..

ఆస్తుల కేసులో వైఎస్ జగన్‌కు ఊరట

జగన్‌ ఆస్తుల కేసులో ఈడీ అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. భారతీ సిమెంట్స్ ఆస్తుల స్వాధీనం వ్యవహారంలో తీర్పును పునఃసమీక్షించాలని సింగిల్‌ జడ్జికి హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అప్పిలేటింగ్‌ అథారిటీలో తేలే వరకు ఆస్తులు స్వాధీనం చేసుకోవద్దని గతంలో సింగిల్‌ జడ్జి ఆదేశాలు జారీ చేయగా.. తమ వాదన వినకుండా ఏకపక్షంగా సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారంటూ ఈడీ అప్పీల్‌ చేసింది.
పూర్తి వివరాలు..

గుంటూరు జడ్పీ పీఠం కోసం వర్గాల పోరు

పృధ్వీలతకు మద్దతుగా రంగంలోకి రజక సంఘాలు రంగంలోకి చిత్తూరు నేత నేడు గుంటూరులో లోకేష్‌తో పృధ్వీలత వర్గం భేటి అధికార పార్టీలో పదవుల పంపకంపై రగడ కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో ఆయా సామాజిక వర్గాలను సంతృప్తి పరచడానికి పదవీ కాలాన్ని పంచారు. ఈ ఒప్పందాలు కొన్ని చోట్ల సాఫీగా అమలవుతున్నాయి. కుర్చీ ఎక్కిన వారు దిగటానికి ససేమిరా అంటున్న సందర్భాల్లో విభేదాలు వీధిన పడుతున్నాయి. ఒప్పందాల్లో రెండో భాగంలో ఉన్న న
పూర్తి వివరాలు..

టీడీపీ నేత తుపాకి మిస్‌ఫైర్

గుడివాడ, కృష్ణాజిల్లా: గుడివాడ క్లబ్‌లో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు తుపాకీ మిస్‌ఫైర్‌ అవ్వడంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఆయన సమీపంలో ఎవరూ లేకపోండంతో ప్రమాదం తప్పింది. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
పూర్తి వివరాలు..

సభలలో డిజిటల్ పై చేస్తున్న ప్రసంగానికి స్పందిస్తున్నారు : సీఎం చంద్రబాబు

• సభలలో డిజిటల్ పై చేస్తున్న ప్రసంగానికి స్పందిస్తున్నారు : సీఎం చంద్రబాబు • రాష్ట్రంలోని యువత ఉపాధి అవకాశాలు మెరుగు, ఆర్ధిక చేయూత వంటి అంశాలపై ప్రత్యేకమైన చర్యలు, శాఖల మధ్య పరస్పరం పథకాల అమలు విధానాలను సమగ్రంగా విశ్లేషణ చెయ్యాలి : సీఎం చంద్రబాబు • ప్రజా సాధికారత సర్వే ను ప్రజలు సమర్ధవంతంగా వినియోగించుకోవాలి : సీఎం చంద్రబాబు • ప్రభుత్వం అందించే పధకాలు వాస్తవ లబ్దిదారులకు అందచెయ్యాలి :
పూర్తి వివరాలు..

రాజాం జన్మభూమి కార్యక్రమం లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

మరికాసేపట్లో రాజాం చేరుకోనున్న సిఎం చంద్రబాబు. ఆర్టీసి కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన జన్మభూమి మా ఊరు సభలో పాల్గోనున్న చంద్రబాబు. సిఎం పర్యటన నేపధ్యంలో గట్టి బందోబస్తు తోపాటు భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు. రాజాం మీదుగా వెళ్ళే బస్సులను ఇతర వాహనాలను ఊరి బయటనుండి దారి మళ్ళింపు. సిఎం భధ్రతా కారణాల దృష్ట్యా ఆర్టీసి కాంప్లెక్స్ ఆవరణలో గల షాపులను మూయించిన పోలీసులు.


పూర్తి వివరాలు..

కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో నాలుగో విడత జన్మభూమి కార్యక్రమం లో పాల్గొన్న అచ్చెన్నాయుడు

కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో నాలుగో విడత జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో భాగంగా చంద్రన్న సంక్రాంతి కానుకను లబ్ధిదారులకు అందజేస్తున్న గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు మరియు జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష.


పూర్తి వివరాలు..

వాంటెడ్ బోర్డ్: తెలుగు రాష్ట్రాల్లో నాయకులు కావాలి?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు కరువాయ్యారా? గతం కంటే ఇప్పుడు రాష్ట్ర అభివృద్దికి గానీ... పార్టీ బలోపేతా నికి గానీ... రాష్ట్ర క్షేత్ర స్థాయిలో గానీ, కేంద్రంలో గానీ... పార్టీ నాయకత్వం విఫలమైందా అంటే దాదాపుగా అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి! ఇందులో తెలంగాణ లో కొంత వరకు వర్తించినా... ఏపీ లో పూర్తి స్థాయిలో ఉందనే చెప్పాలి. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు రాష్ట్ర రాజకీయాలే తప్ప కేంద్రంలో చ
పూర్తి వివరాలు..

మోదీ పాసవుతారా ఎన్నికల పరీక్ష

ఎన్నికల నగారా మరోసారి మోగింది. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు దేశంలోని ఐదు రాష్ట్రాలలో పలు దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పనితీరు మీదా, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మీదా, ప్రధానమంత్రిగా మోదీ పనితీరు మీదా ఈ ఎన్నికలు ఓ రెఫరెండం అని భావిచేవారు లేకపోలేదు. జరగబోయే ఎన్నికలన్నీ కూడా భాజపాకు కీలకమైన ప్రాంతాలలో కావడమే దీనికి కారణం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ముందుగా అందిచూపు ఉత్తర్ప్రదేశ్ వ
పూర్తి వివరాలు..

పేదల బ్యాంకు ఖాతాలకు సొమ్ము!

న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో గొప్ప నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) పథకం క్రింద వచ్చిన సొమ్ము గురించి రాబోయే బడ్జెట్‌లో స్పష్టమైన నిర్ణయం వెలువడబోతోందంటున్నారు. పేదల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బును జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేస్తారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకా
పూర్తి వివరాలు..

మోదీని తప్పించి.. దేశాన్ని కాపాడండి: మమత

ప్రధానిగా నరేంద్ర మోదీని తప్పించి దేశాన్ని కాపాడాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మోదీ పదవి నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న ఆమె.. ప్రస్తుతం బీజేపీ మరో నాయకుడిని కేంద్రానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. మోదీని తప్పించి ప్రధానిగా అద్వానీ, రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీలలో ఎవరో ఒకరు బాధ్యతలను చేపట్టాలని కోరారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితికి మోదీనే కారణమన్నారు.


పూర్తి వివరాలు..

పవన్ ఎఫెక్ట్.. స్పందించిన చంద్రబాబు

శ్రీకాకుళం: ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకువచ్చింది. ఉద్దానంలో కిడ్నీ భాదితులను కలిసి పరామర్శించి వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన విజ్ఞప్తితో... సీఎం చంద్రబాబు స్పందించారు. కుప్పం తరహాలో ఉద్దానంలో కూడా మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని అధికారులను బాబు ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శికి ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ నెల
పూర్తి వివరాలు..

ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు

వెలగపూడి: ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఎపి స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ తెలిపారు.. వెలగపూడిలో అసెంబ్లీ భవననిర్మాణాలను ఆయన పరిశీలించారు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవన నిర్మాణాలు సాగుతున్నాయన్నారు.. భవనాల నిర్మాణం మరో 20 రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు.
పూర్తి వివరాలు..

ప్రణబ్ ధిక్కార స్వరం

రాష్ట్రపతి పదవి తెల్ల ఏనుగుతో సమానం అని భారతీయుల ప్రగాఢ నమ్మకం. ప్రజల్లో ఈ నమ్మకం ఎక్కడ తొలగిపోతుందోనని ఆ పదవిని చేపట్టేవారు కూడా బహు జాగ్రత్త వహిస్తుంటారు. విదేశాల చుట్టూ గిరగిరా తిరగడం దగ్గర్నుంచీ వీలైనన్ని బహుమానాలు సేకరించడం వరకూ సాధారణ పౌరులకి ఈర్ష్య కలిగే స్థాయిలో వీరి చర్యలు సాగుతుంటాయి. ఎక్కడో అబ్దుల్ కలాం వంటి వారే దీనికి మినహాయింపుగా కనిపిస్తుంటారు. కాబట్టి పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రణ
పూర్తి వివరాలు..

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్

కర్నూలు: సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లాలో జగన్‌ రైతు భరోసాయాత్ర నిర్వహించారు. ఆత్మకూరులో రోడ్ షోలో చంద్రబాబుపై జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు జనం మధ్యకు వస్తే రాళ్లతో కొడతారని హెచ్చరించారు. కేబినెట్‌లో రైతు రుణమాఫీపై చర్చించడం లేదని ఆరోపించారు. రైతుల భూములను లాక్కొని అమ్ముకోవాలని చూస్తున్నారని, రైతులకు పూర్తిగా రుణమాఫీ, వెలిగొండ ప్
పూర్తి వివరాలు..

జయలలిత వారసత్వం నిలుపుతా...రాజకీయాల్లోకి వస్తా..!

చెన్నై: రాజకీయాల్లోకి రాకుండా తననెవరూ ఆపలేరని దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప జయకుమార్ తెలిపారు. జయలలిత మృతిచెందిన నెలరోజుల తరువాత తొలిసారిగా తన రాజకీయ ప్రవేశంపై దీప పెదవివిప్పారు. టీనగర్‌లోని దీప ఇంటికి అన్నాడీఎంకే కార్యకర్తలు కొద్ది రోజులుగా తరలి వస్తున్నారు. జయలలితకు అసలైన వారసులు ఆమేనని, జయలలిత చేపట్టిన పథకాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలను స్యయంగా దీప ముందుకు తీసుకువెళ్లాలని కొందర
పూర్తి వివరాలు..

హోదా, ప్యాకేజీకి తేడా లేదు: ప్రత్తిపాటి

కృష్ణా: హోదా, ప్యాకేజీకి తేడా లేదని, ప్రజలు గమనించాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ప్రత్యేక హోదాతో వచ్చే నిధులు ప్యాకేజీ ద్వారా ఇస్తామంటేనే ఒప్పుకున్నామని, ప్యాకేజీ కింద ఏపీకి రూ. 86వేల కోట్ల నిధులు వస్తాయని గుర్తుచేశారు. నూజివీడులో జన్మభూమి కార్యక్రమంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో గృహనిర్మాణ పథకంలో రూ. 5వేల కోట్ల స్కాం జరిగిందన్నారు. తుది దశలో దర్
పూర్తి వివరాలు..

పాకిస్థాన్‌కు ఊహకందని దెబ్బ తప్పదు : అమిత్ షా

న్యూఢిల్లీ : భారతదేశంపై ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగిస్తే పాకిస్థాన్‌కు ఊహకందని దెబ్బ తప్పదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అటువంటి చర్యను నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి తీసుకుంటుందన్నారు. శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో భారత సైన్యం నిర్వహించిన మెరుపు దాడులు, రూ.500, రూ.1000 నోట్ల రద్దు గురించి అమిత్ షా ఎక్కువ
పూర్తి వివరాలు..

వెన్నుపోటు నేతలను బంగళాఖాతంలో కలపాలి

వెన్నుపోట్ల నేతలను బంగళాఖాతంలో కలపాలని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్అదినేత జగన్ అన్నారు.ఒక పార్టీలో గెలిచినవారు మరో పార్టీలోచేరితే రాజీనామా చేయాలని,లేదంటే వారిపై అనర్హత వేటు వేయాలని ఆయన అన్నారు. కాని దురదృష్టవశాత్తు అలా జరగడం లేదని,అనైతిక రాజకీయాలకు తెలుగుదేశం పాల్పడుతోందని జగన్ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో రైతు భరోసాయాత్రలో ఆయన పాల్గొన్నారు. సీఎంగా గెలవాలంటే ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను లాక్కో
పూర్తి వివరాలు..

మరో 1700కోట్లను బాబు నదిలో కలుపుతున్నారు

పట్టిసీమ పేరుతో 1600 కోట్ల రూపాయలను గోదాట్లో కలిపేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురుషోత్తం పట్నం పేరుతో మరో 1700 కోట్లను వృదా చేయబోతున్నారని మాజీ ఎమ.పి ఉండవల్లి అరుణకుమార్ ఆరోపించారు.పురుషోత్తం పట్నం లిఫ్ట్ కింద పోలవరం ఆయకట్టు కాకుండా, కొత్త ఆయకట్టు ఉందా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం వచ్చే ఏడాది ఆఖరు నాటికి పూర్తి అవుతుందని చెబుతున్న చంద్రబాబు ఈ రెండు లిఫ్ట్ స్కీమ్ లను ఎందుకు ఆరంభించారన్నది ఎవరి
పూర్తి వివరాలు..

విపక్ష నేత వైవిధ్యభరిత ప్రసంగం

ఎపి శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించిన సందర్భంలో చేసిన ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. మీడియాలో వచ్చిన ఈ కధనం లో ఆయన ఆద్యాత్మికత జోడించి మాట్లాడారు.‘రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్‌... ఇలా మనం చదివే పవిత్ర గ్రంథాలన్నీ చెప్పేది ఒక్కటే... ప్రలోభాలు, మోసాలు ఒడిపోతాయి. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు బంగాళాఖాతంలో కలిసిపోతారు. చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి’’ ‘‘ఇప్పటివరకు
పూర్తి వివరాలు..

మంత్రి పదవి ఆశించిన టిడిపి నేత ఆశలపై నీళ్లు

తూర్పు గోదావరి జిల్లా పిఠా పురం ఎమ్మెల్యే వర్మ మంత్రి పదవి ఆశిస్తున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఠాపురానికి వచ్చినప్పుడు తన అనుచరుల ద్వారా మనసులో మాట చెప్పించారట. పురుషోత్తం పట్నం లిప్ట్ ఇరిగేషన్ పధకం ఆరంబోత్సవానికి చంద్రబాబు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది.సభలో చంద్రాబు ప్రసంగిస్తున్నప్పుడు వర్మ అనుచరులు వర్మకు మంత్రి పదవి ఇవ్వాలని నినాదాలు చేశారట. దీనిపై చంద్రబాబు స్పంద
పూర్తి వివరాలు..

బాబు వచ్చాడు..మూడేళ్లుగా కరువే-కరువు:జగన్

బాబు వచ్చాడు..మూడేళ్లుగా కరువే-కరువు: పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదురుణాలు మాఫీ కావడం లేదురైతులు బ్యాంకుల గడప తొక్కలేని పరిస్థితిచంద్రబాబు ఎప్పుడు పోతాడా అని ప్రతీ గ్రామం ఎదురుచూస్తోందిలింగాపురంలో వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జననేత కర్నూలు(లింగాపురం))పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, రుణాలు మాఫీ గాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు వారిని ఆదుకోవాల్సిందిపోయి ఎగతాళిగా మాట్లాడ
పూర్తి వివరాలు..

చంద్రబాబుకు కెవిపి సవాల్

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీటి పారుదల ప్రాజెక్టులపై విపక్షంగా టిడిపి ఆరపించినప్పపుడు ప్రతి ప్రాజెక్టు వద్ద చర్చ పెట్టామని , ఇప్పుడు కూడా టిడిపి తనపై వస్తున్న ఆరోపణలకు చర్చకు సిద్దమా అని కాంగ్రెస్ ఎమ్.పి కెవిపి రామచంద్రరావు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై విజయవాడ లేదా ,మరెక్కడైనా చర్చకు సిద్దమని ఆయన సవాల్ చేశారు.కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు కోసం ఎలాంటి కృషి చేయలేదని టడిపి నాయకులు ప్రచార
పూర్తి వివరాలు..

భారత్ వెలిగిపోతోంది:వెంకయ్యనాయుడు

విశాఖలో ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సులో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. భారత్ వెలిగిపోతుందని రేటింగ్ సంస్థల గణాంకాలే వెల్లడిస్తున్నాయని తెలిపారు. పారదర్శక లావాదేవీలు జరగాలంటే ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా వాడాలని ఆయన సూచించారు.
పూర్తి వివరాలు..

ఈసీని కలిసిన ములాయం

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గుర్తు విషయమై ములాయంసింగ్ యాదవ్ ఢిల్లీలోని ఈసీని కలిశారు. తమ పార్టీలో వివాదం నెలకొన్న మాట వాస్తవమని.. దీనికి ఒకరే కారణమని తెలిపారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందని, అఖిలేష్‌తో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. సీఎం అఖిలేష్‌ను రాంగోపాల్‌యాదవ్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాగా పార్టీ గుర్తు విషయంలో ఈసీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
పూర్తి వివరాలు..

జననేతకు ఘన స్వాగతం:రైతు చాంద్‌బాషా కుటుంబానికి వైయస్‌ జగన్‌ పరామర్శ

బండి ఆత్మకూరు: అధైర్య పడొద్దు..అండగా ఉంటానని ఆప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు చాంద్‌బాషా కుటంబానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భరోసా కల్పించారు. కర్నూలు జిల్లాలో వైయస్‌ జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఐదో రోజు సోమవారం శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగింది. బండి ఆత్మకూరు మండలం బీ.కోడురు గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు చాంద్‌బాషా కుటుంబాన్ని వైయస్‌ జగన్‌ పరామర్శించారు.  
పూర్తి వివరాలు..

బాబు హామీలపై నిలదీయండి:జగన్ కర్నూలు జిల్లాలో ముగిసిన మొదటి విడత రైతు భరోసా యాత్ర

కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 90 శాతం ప్రాజెక్ట్ లు పూర్తయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు 5 శాతం మాత్రమే పనులు చేసి ఆ ప్రాజెక్టులన్నింటినీ తానే కట్టించినట్లు అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని మనందరం ఒక్కటై బంగాళాఖాతంలో కలిపేద్దామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో వైయస
పూర్తి వివరాలు..

తమిళులు సాధించారు.. మనం చేయలేమా?: కేవీపీ

3రోజులు ఆందోళనలు చేసి తమిళులు జల్లికట్టుపై ఆర్డినెన్స్ సాధించారని.. వాళ్లలో ఉన్న ఐక్యత మనకు లేదా అని MP KVP రామచంద్రరావు CM చంద్రబాబును ప్రశ్నించారు. తమిళుల ఆందోళనలను ఆదర్శంగా తీసుకుని APకి ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధితో పోరాటం చేయాలని చంద్రబాబుకు KVP లేఖ రాశారు. ఆట కోసం తమిళులు అంత చేస్తే.. రాష్ట్రం కోసం మనం కూడా ఐక్యంగా పోరాడాలని సూచించారు. అటు ఈ పోరాటానికి నాయకత్వం వహించాలని బాబును KVP కోరారు.
పూర్తి వివరాలు..

జల్లికట్టు స్పూర్తితో హోదా సాధించాలి: పవన్

జల్లికట్టు నిర్వహించాలని తమిళనాడు ప్రజలు చేసిన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పూర్తి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలు ప్రత్యేకహోదా సాధించాలన్నారు. లక్షలమంది తమిళులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినా.. ఎక్కడా అసాంఘిక ఘటనలు జరగలేదన్నారు. అటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఏ ప్రభుత్వం అయినా గౌరవించకుంటే ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతాయన్నారు.
పూర్తి వివరాలు..

ప్రభుత్వ విజయాలేంటో చెప్పండి: నాదెండ్ల

ఏపీ సీఎం చంద్రబాబుకు శాసనసభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ లేఖ రాశారు. విదేశీ పర్యటనలు, భాగస్వామ్య సదస్సులతో రాష్ట్రానికి జరిగిన మేలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటం తప్ప రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేవన్న ఆయన.. ఈ రెండున్నరేళ్ళలో ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటో తెలపాలని లేఖలో డిమాండ్ చేశారు.
పూర్తి వివరాలు..

నేనెన్నో చూశా, భయపడను: బాబు

హోదాపై మాట్లాడేందుకు తనకు భయం లేదని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇరవై ఏళ్ళ క్రితమే సీఎం పదవిలో కూర్చుని ఎన్నో చూశానని, ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. హోదాతో సమాన ప్యాకేజ్ ఇచ్చినపుడు తిరిగి ఈ అంశాన్ని తెరపైకి తేవద్దన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ఎవరైనా నిరసన తెలుపుతారా? అని ప్రశ్నించారు. సీఐఐ సదస్సు ఉన్న విశాఖలో ఆందోళనలకు పిలుపునివ్వటం సరికాదన్నారు
పూర్తి వివరాలు..

పవన్ కళ్యాణ్ ను ఆకట్టుకునే యత్నమా?

ఎపి ప్రత్యేక హోదా ఉద్యమానికి జనసేన నేత పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలని శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య విజ్ఞప్తి చేశారు.పవన్ తో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ సిద్దంగా ఉదని ఆయన తెలిపారు.ప్రత్యేక హోదా కోసం పార్టీలు జెండాలు పక్కన బెట్టి పోరాడాలని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం చెప్పిన విషయాన్ని సాయంత్రానికి మరచిపోతారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి గతంలో చంద్రబాబ
పూర్తి వివరాలు..

జగన్ యువత ను రెచ్చగొట్టడం మంచిది కాదు: కళావెంకటరావు

తెలుగుదేశం పార్టీ ఎపి శాఖ అద్యక్షుడు కిమిడి కళా వెంకటరావు విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీని తప్పు పడుతున్నారు. విపక్ష నేత జగన్ యువతను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై జగన్ ఎందుకు డిల్లీలో ధర్నా చేయరని ఆయన అంటున్నారు. పెట్టుబడుల సదస్సుకు ముందు రోజు విశాఖలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. పేరు ఏదైతేనేమీ ప్యాకేజీని కేంద్రం ఇచ్చిన విషయాన్ని మనం విస్మరించవలసిన అవసరం లేదన
పూర్తి వివరాలు..

బాబు సిగ్గుతో తలదించుకోవాలి: జగన్

ఏపీకి ప్రత్యేకహోదా కావాలని రాష్ట్రంలోని ప్రతి యువకుడు కోరుతున్నాడని YCP అధినేత జగన్ అన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ చేరుకున్న జగన్.. తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా జరిగిన ఆందోళనను అడ్డుకున్న CM చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఎయిర్‌పోర్టులో తనని అడ్డుకోవడాన్ని తప్పుబట్టిన ఆయన.. హోదా డిమాండ్‌కు బాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు
పూర్తి వివరాలు..

జగన్ గారిపై కోపంతో రాయలసీమపై విష ప్రచారం చేసే విదానానికి ముఖ్యమంత్రి స్వస్దిపలకాలి.

ఏపీలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా దానికి, రాయలసీమకు ముడిపెట్టడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారింది. హోదా పోరాటంలో బాగంగా విశాఖ కేంద్రంగా ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రతిపక్ష నేత వై యస్ జగన్ గారి నాయకత్వంలో ఆందోళన జరిగింది. ప్రతిపక్షం ఆందోళనపై ముఖ్యమంత్రి రాజకీయంగా వ్యతిరేకించారు వారి విదానం వారిది. కాని విశాఖలో జరప తలపెట్టిన ఆందోళనను వ్యతిరేకించే పేరుతో విశాఖను పులివెందులగా మార్చే కుట్రను జగన్ చేస్తున్నారంటూ మ
పూర్తి వివరాలు..

వైఎస్ తండ్రిని చంపిన వ్యక్తికి బాబు పదవి ఇచ్చారు:సజ్జల

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి 1998లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లోనే హత్యకు గురయ్యారని, ఆ హత్య కేసులో నిందితుడికి చంద్రబాబు రక్షణ కల్పించడమే కాక, మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.వైఎస్ తన తండ్రిని హత్య చేసిన వారి జోలికి వెళ్లకుండా తన అనుయాయులను సైతం అదుపు చేశారని, ఆయన ముఖ్యమంత్రి అయిన త
పూర్తి వివరాలు..

హోదాపై రాష్ట్రపతికి కేవీపీ లేఖ

విభజన సమయంలో ఏపికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని రాష్ట్రపతికి రాజ్యసభ సభ్యుడు కేవీపీ లేఖ రాశారు. ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి వెంటనే పూర్తి చెేయాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని, 2014-15 ఆర్థిక లోటును భర్తీ చెయ్యాలని పేర్కొన్నారు. వచ్చే రాష్ట్రపతి ప్రసంగంలో హోదా అంశాన్ని చేర్చాలని కోరారు.
పూర్తి వివరాలు..

ఆనాడు గుర్తుకు రాలేదా: పవన్

ఏపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హోదా అడుగుతుంటే రాజకీయ అనుభవం అడుగుతున్న బీజేపీ.. తాను మద్దతిచ్చినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతోనే మోదీ, చంద్రబాబుకు మద్దతు ఇచ్చానన్నారు. యువతను దృష్టిలో పెట్టుకునే మూడేళ్ళు గడుస్తున్నా ఏ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేదన్నారు.
పూర్తి వివరాలు..

మీరేమైనా దేవుళ్ళా: పవన్

ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వెంకయ్య స్వర్ణ భారత ట్రస్టు మీద పెట్టిన శ్రద్ధ హోదాపై పెడితే ఎప్పుడో పరిష్కారం లభించేదన్నారు. ప్యాకేజీ ప్రసాదమంటున్న వెంకయ్య.. మీరేమైనా దేవుళ్ళా అని ప్రశ్నించారు. అటు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు హోదాపై ఎందుకు రాజీపడ్డారో చెప్పాలన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకురావద్దన్నారు.
పూర్తి వివరాలు..

హోదా వల్ల ఎన్నో కోల్పోతాం: కామినేని

ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం వైఖరిని తప్పుబట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఖండించారు. ప్యాకేజీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, హోదా వల్ల ఎన్నో ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని పవన్ రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించిన కామినేని.. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న స్వర్ణభారత్ ట్రస్టుపై ఆయన విమర్శలు చేయడం సరికాదన్నారు.
పూర్తి వివరాలు..

బాబు, మంత్రులకు పిచ్చిపట్టి ప్రతిపక్ష నేతపై కారుకూతలు కూస్తున్నారునోరు అదుపులో పెట్టుకోవాలని వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ హెచ్చరిక

బాబు, మంత్రులకు పిచ్చిపట్టి ప్రతిపక్ష నేతపై కారుకూతలు కూస్తున్నారునోరు అదుపులో పెట్టుకోవాలని వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ హెచ్చరిక విజయవాడః చంద్రబాబు నాయుడు క్యాబినెట్ అంతా శాడిస్టుల క్యాబినెట్ ల తయారైందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ...  ఆర్కే బీచ్ లో విద్యార్థు
పూర్తి వివరాలు..

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దున్నపోతుల్లా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై వ్యక్తిగత విమర్శలు : బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యాజీ వేమా

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రాధికారం కోసం పగటి కలలు కంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యాజీ వేమా ఆరోపించారు. రెండు దున్నపోతుల్లా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లుండీ చూడలేని కబోదులు వారు. వెంకయ్య కుమార్తె స్
పూర్తి వివరాలు..

తాత్కాలిక కట్టడాలు తప్ప ఏం జరిగింది?:బొత్స

ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక కట్టడాలు తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖను తానే అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు.. 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఉక్కు నగరానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలన్నారు. అటు ప్రత్యేకహోదా కావాలనే వారిని సీఎం తొక్కేస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఇటీవల విశాఖలో జరిగిన ఒప్పందాలపై ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పూర్తి వివరాలు..

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌తో కమిటీ వేయాలి – మీరు చెప్పేవన్నీ అవాస్తవాలే.. డీఐపీపీ లెక్కలే సాక్ష్యం – మాయమాటలతో అందర్నీ అన్నిసార్లూ నమ్మించలేరు – పది లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అబద్ధమే –పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి 

హైదరాబాద్ః సీఐఐ భాగస్వామ్య సదస్సు పేరుతో టీడీపీ ప్రభుత్వం మరోసారి అబద్ధాల ప్రచారానికి సిద్ధమైందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. సీఐఐ సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడులన్నీ వాస్తవాలైతే ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌తో ఓ కమిటీ వేయించి శ్వేతపత్రం విడుదల చేయాలని బుగ్గన డిమాండ్‌ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ
పూర్తి వివరాలు..

జగన్ పై కేసు నమోదుకు రంగం సిద్ధం..?

విజయవాడ : మినుమ పంట పొలాలను పరిశీలించేందుకు తన పొలాన్ని నాశనం చేశారంటూ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో వైఎస్ జగన్ పై ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా కాకుమాను గ్రామానికి చెందిన జోగి శేషగిరిరావు తన పొలాన్ని నాశనం చేసినందుకు వైఎస్ జగన్, గన్నవరం వైసీపీ ఇన్ చార్జి దుట్టా రామచంద్రరావుల పై కేసు నమోదు చేయాలని ఎఫ్ఐఆర్ లో పెర్కోన్న కాకుమాను గ్రామస్థులు జగన్ పై కేసు నమోదు చేసేందుకు న్యాయ సలహా తీసు
పూర్తి వివరాలు..

లోకేష్‌కు మంత్రి పదవి ఖాయం!

యువనేత నారా లోకేశ్‌కు మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోకేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకోబోతున్నట్లు టీటీడీపీ నేతలతో గురువారం జరిగిన సమావేశంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టంచేసినట్లు సమాచారం. లోకేశ్‌కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించాలని టీటీడీపీ నేతలు కోరడంతో అది సాధ్యం కాదని, ఆయనకు ఏపీలో మంత్రి పదవి అప్పగించాలని అనుకుంటున్నట్లు బాబు వారికి వివరించారట.
పూర్తి వివరాలు..

హస్తానికి ఏమైంది? రాహుల్‌గాంధీతో తిరోగమనం

ఉత్తర్‌ప్రదేశ్‌... దేశరాజకీయాలకు ఆయువుపట్టు లాంటిది. లోక్‌సభ నియోజకవర్గాలు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రం ప్రతి సార్వత్రిక ఎన్నికలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రధానమంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన జవహర్‌లాల్‌నెహ్రూ, లాల్‌బహుదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీ, చరణ్‌సింగ్‌, రాజీవ్‌గాంధీ, విశ్వనాథ్‌ప్రతాప్‌సింగ్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయి... తదితరులు ఈ రాష్ట్రం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమ
పూర్తి వివరాలు..

రానున్నది రామరాజ్యమే:అన్ని చోట్లా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాం:అమిత్ షా

పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటు అవుతాయని పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్లు వచ్చిన తర్వాత.. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని, ఐదు రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆయా ప్రాంతాలు కొత్త ఎత్తులను చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయాలకు గాను కోట్లాది మంద
పూర్తి వివరాలు..

మాకు పారికర్ కావాలి:గోవా BJP శ్రేణులు

కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రి కావాలని ఆ రాష్ట్ర భాజపా ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఈ మేరకు వారంతా సంతకాలు చేసిన ఒక పత్రాన్ని పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. దీనిపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ ఆదివారం భాజపా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజా ఎన్నికల్లో గోవాలో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవటం గమనార్హం. ప్రస్తుతం కాంగ్రెస
పూర్తి వివరాలు..

2019లో జగన్‌ సీఎం కావడం తథ్యం: రోజా

2019లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నిర్వహించిన వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరికీ న్యాయం చేశారు కాబట్టే.. వైఎస్‌ఆర్‌ ప్రతిరూపాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో తమ పార్టీని తప్పకుండా ఆదరిస్తారని వైకాపా సీనియర్‌
పూర్తి వివరాలు..

పవన్ మారాలి:జగన్

సీఎం చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణే కాదు, ఎవరు పోరాడినా మద్దతిస్తామని, కలిసి పనిచేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. కాని ప్రస్తుతం చంద్రబాబు చెప్పినట్టు వినే స్థితిలో పవన్‌ ఉన్నారని, ఆ విధానం మారాలని జగన్ సూచించారు. 2019 ఎన్నికల్లో మార్చినాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయపార్టీగా అవతరిస్తుందని, 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుంద
పూర్తి వివరాలు..

నగరి ఎమ్మెల్యే రోజాను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ సిఫార్సు చేస్తూ సభాహక్కుల కమిటీ నివేదిక

దళిత ఎమ్మెల్యే అయిన తనను రోజా తీవ్రంగా అవమానించారంటూ గతంలో ఫిర్యాదు చేసిన అనిత మొత్తం 62 పేజీల నివేదికను సభ ముందు ఉంచిన కమిటీ నివేదికపై నిర్ణయాధికారాన్ని సభకే వదిలేసిన కమిటీ  విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదికలో పేర్కొన్న కమిటీ పలు మార్లు రోజా విచారణ కమిటీ రోజా ఎక్కడా భేషరతుగా క్షమాపణ చెప్పటానికి సిద్ధపడలేదని అభిప్రాయపడిన కమిటీ రోజా వాదనలను నివేదికలో పొందుపరిచిన కమిటీ 
పూర్తి వివరాలు..

వ్యవస్థను మార్చడం నా ఒక్కడి వల్లా కాదని ఎన్టీఆర్‌ను పార్టీ పెట్టమన్నా.. - టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు

నేను ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది.. నేను అనారోగ్యం పాలైతే రాష్ట్రానికి సుస్తీ చేస్తుంది..’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘నేను ఆహార నియమాలను చాలా బాగా పాటిస్తాను. నా భార్య చేతిలో ఉండే రిమోట్‌ నన్ను కంట్రోల్‌ చేస్తుంది. నేను బతకడానికి తింటా కానీ.. తింటానికి బతకను..’ అని చెప్పారు. బుధవారం రాత్రి గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆ పార్ట
పూర్తి వివరాలు..

మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణం: ఎమ్మెల్యే జలీల్ ఖాన్

మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర అలజడి నెలకొందని విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. విజయవాడలో మైనార్టీ సంఘాలు, అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో మంత్రి వర్గ విస్తరణ విషయమై జలీల్ ఖాన్ మాట్లాడుతూ, 12 శాతం ఉన్న మైనార్టీలను విస్మరించడం దారుణమైన విషయమని, సీఎం చంద్రబాబు తలచుకుంటే మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వొచ్చని అన్నారు.
పూర్తి వివరాలు..