Weekly News

సచివాలయంలోమంత్రుల కార్యాలయ నంబర్లు

.

ఉపముఖ్యమంత్రి (హోం)వారి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి --------------- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల కార్యాలయాల దూరవాణిల నంబర్లు ———————————————————— 1. కె.ఇ. కృష్ణమూర్తి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) 0863 — 2442600 2442031 ————————————————————— 2. నిమ్మకాయల చినరాజప్ప ఉపముఖ్యమంత్రి(హోం) 0863 — 2442147 2442149 ————————————————————— 3. యనమల రామకృష్ణుడు ఆర్ధిక శాఖ మంత్రి 0863 — 244
పూర్తి వివరాలు..

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

రబీ రుణాలు ఇవ్వడంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. జన్మభూమి, డిజిటల్ లావాదేవీలు, సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై తన నివాసం నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. సంక్రాంతికి 3రోజుల ముందే లబ్ధిదారులకు చంద్రన్న కానుకలు అందించాలన్నారు. బ్యాంకర్లు, అధికారుల సహకారంతోనే నగదు సమస్యను అధిగమించామని, ప్రభుత్వ చర్యల కారణంగానే పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరిగిందన్నారు.
పూర్తి వివరాలు..

నారావారిపల్లెలో ఏటీఎం లేదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో ఏటీఎం గానీ, బ్యాంకు గానీ లేవట. ఇదే కాదు.. ఈ గ్రామానికి దగ్గరలోని సుమారు డజను పల్లెల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఏ టీ ఎం కోసమో, బ్యాంకులో కొత్త నోట్లు విత్ డ్రా చేసుకోవడానికో ఈ గ్రామాల ప్రజలు దాదాపు 10 కి.మీ.ప్రయాణించి చంద్రగిరి లేదా తిరుపతి రావాల్సిందే. ఇక స్వైపింగ్ మెషిన్ల సంగతి సరేసరి. నారావారిపల్లె లో ఓ రేషన్ డీలర్ మాత్రం ఒక ఎలెక్
పూర్తి వివరాలు..

ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు: చంద్రబాబు

ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం టీడీపీ ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 24 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, కొత్తగ
పూర్తి వివరాలు..

ఆర్టీసీలో షాడో ఎండీ!

► ప్రతి పనికీ ఆయన కటాక్షం కావాల్సిందే.. ► ఈడీలు చెప్పినా ఎండీని కలిసేందుకు అనుమతి ససేమిరా ► షాడో దెబ్బకు విలవిలలాడుతున్న ఉద్యోగులు సాక్షి, అమరావతి బ్యూరో: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది ఆర్టీసీలో ఎండీ పేషీలో పనిచేసే ఓ కీలక అధికారి వ్యవహారం. షాడో ఎండీగా చలామణి అవుతున్న ఈయన కొన్నేళ్లుగా పేషీలోని తిష్ట వేయడంతో వేసుక్కూర్చుకున్నారు. ఆయన కనుసన్నల్లోనే పాలనా వ్యవహారాలు నడిపిస్తు
పూర్తి వివరాలు..

రైతులకు ఉచిత భోజనం

గుంటూరు మిర్చి యార్డుకు పంట విక్రయించేందుకు వచ్చే రైతులకు ఈ నెల 19 నుంచి ఉచితంగా భోజనం అందించనున్నారు. తాజాగా ఇస్కాన్ ప్రతినిధులతో భేటీ అయిన మిర్చి యార్డ్ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు.. రైతులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. గతంలో కాంట్రాక్టర్లకు ఈ పథకాన్ని అందించడం వల్ల జరిగిన లోపాలు.. మరోసారి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని, 4 నెలల పాటు ఈ పథకం ఉంటుందని ఆయన తెలిపారు.
పూర్తి వివరాలు..

పవన్ ఇచ్చిన 48 గంటలు సరిపోదు: కామినేని

ఉద్దానం కిడ్నీ సమస్యపై ఏపీ ప్రభుత్వం స్పందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన 48 గంటల గడువు సరిపోదని మంత్రి కామినేని అన్నారు. ఈ సమస్యకు కారణాన్ని ఇంతవరకు డాక్టర్లే కనిపెట్టలేకపోయారని.. పవన్ చెప్పినట్లుగా రూ.100కోట్లతో సమస్య పరిష్కారం అవుతుందంటే ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఉద్దానం బాధితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. సోంపేట, పలాసలో త్వరలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
పూర్తి వివరాలు..

1300 పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ వ్యవసాయశాఖలో 1300 పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులపై ఒప్పంద ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కొట్టివేసింది. కాగా గతంలో 1300 ఏవో, ఏఈవో పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ జారీ చేయగా.. దీనిని సవాల్ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


పూర్తి వివరాలు..

కల్తీ మద్యం కేసులో వైసీపీ ఎమ్మెల్యేలు!

ఎపిలో ఇద్దరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మల్యేలపై సిఐడి చార్జీషీట్ వేసిన తీరు వివాదాస్పదం అవుతోంది. కల్తీ మద్యం కేసులకు సంబందించి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి, కావలి ఎమ్మల్యే ప్రతాపరెడ్డిలపై కూడా ఈ కేసు పెట్టారు. విశేషం ఏమిటంటే చిత్తూరు,ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో సహా నెల్లూరు జిల్లాలో ఈ కేసులు నమోదు అయ్యాయి. సిఐడి అదికారులు కేవలం నెల్లూరు కు సంబందించిన వారిపైనే చార్జీషీట్ వే
పూర్తి వివరాలు..

ఆంద్రప్రదేశ్ లో మరో వివాదాస్పద నిర్ణయం

ఆంద్రప్రదేశ్ లో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ స్కూళ్లలో తెలుగు మీడియం ను రద్దు చేస్తూ మున్సిపల్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై టీచర్ల సంఘాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. మున్సిపల్ మంత్రి నారాయణ అర్దరాత్రి తీసుకున్న నిర్ణయం పూర్తి విద్యార్ధి వ్యతిరేకంగా ఉందని, అసలు ఆయనకు ఈ అదికారం లేదని టీచర్ల సంఘాల నేతలు అంటున్నారు. పాఠశాల విద్య శాఖ దీనిపై నిర్ణయం చేయవలసి ఉంటుందని వారు చెప్పారు.ఒ
పూర్తి వివరాలు..

వ్యవసాయశాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పల్లారావు గారి నేటి కార్యక్రమాలుః

9.00 గంటలకు చిలకలూరిపేట పాత పశువుల సంత గ్రౌండ్ నందు ఈ నెల 18 నుండి జరగబోయే పశుబల ప్రదర్శన గ్రౌండ్ కు శంఖుస్ధాపన చేస్తారు. * 9.30 గం శారద స్కూలు నందు స్వర్ణాంధ్ర ట్రస్ట్ ఆద్వర్యంలో ఉచిత శిక్షణా గ్రూపు-2 సర్వీస్ కార్యక్రమంను ప్రారంభిస్తారు. * 10.00 గంటలకు చిలకలూరిపేటలో 22,23,24 వార్డుల నందు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారు. * 11.15 గం చిలకలూరిపేట నియోజవర్గం రామచంద్రపురం గ్రామంలో వివిధ అ
పూర్తి వివరాలు..

నేటి టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యాంశాలు

మేలైన విధానాలు, పద్దతుల రూపకల్పనకు జన్మభూమి వేదిక కావాలి ప్రజల భాగస్వామ్యం, సానుకూల వాతావరణం ఉంటేనే ఫలితాలు సాధిస్తాం మన జన్మభూమి ప్రపంచానికే మంచి నమూనా కావాలి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి పేదరికం నిర్మూలనకు కృషిచేస్తున్నాం ఉత్పాదకత పెంచి ఆదాయాలు పెంచేందుకు కృషిచేస్తున్నాం: సీఎం చంద్రబాబు ఆనంద ఆదివారం కాన్సెప్ట్ అన్ని పంచాయితీలలో, మున్సిపాలిటీలలో ముందుకు తీసుకెళ్ళాలి ఉల్లాసం, వికాసం, చైతన్యం,న
పూర్తి వివరాలు..

చావో రేవో తేల్చుకోవడం తప్ప మరో మార్గంలేదు : ముద్రగడ

తూర్పుగోదావరి : చావో రేవో తేల్చుకోవడం తప్ప తమకు మరో మార్గం లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఆదివారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. చంద్రబాబు తన హామీని నిలబెట్టుకోవడానికి బదులు మమ్మల్ని ఎలా ఓడించాలని ఆలోచిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే మాకు రిజర్వేషన్‌ ఇవ్వడానికి ఏం ప్రతిఫలం కావాలో చెబితే అదిస్తామన్నారు. ఈ పోటీలో ఒకరిని ఓడించాలని చూస్తే మిగిలినవారూ
పూర్తి వివరాలు..

NDRF క్యాంపస్‌కు సోమవారం శంకుస్థాపన

3 రాష్ట్రాల విపత్తుల రక్షణ కోసం ఏర్పాటు చేయనున్న NDRF క్యాంపస్‌కు సోమవారం కృష్ణా జిల్లాలో శంకుస్థాపన జరగనుంది. కొండపావులూరు వద్ద 50 ఎకరాల్లో శాశ్వత, శిక్షణ భవనాలు, సిబ్బంది నివాసాలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేస్తారు. దీని కోసం కేంద్రం రూ.200 కోట్లు కేటాయించగా.. AP, తెలంగాణ, కర్ణాటకలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే ఇక్కడి నుంచి దళాలు అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటాయట.
పూర్తి వివరాలు..

కొత్తగా 9 మండలాలు?

రాష్ట్రంలో మరో తొమ్మది కొత్త మండలాలను కూడ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి.నూతన మండలాలను ఏర్పాటు చేసేందుకు పభుత్వం క్షేత్రస్దాయి నుంచి గణాంకాలను కూడ సేకరిస్తోంది. ఆర్దిక భారం పెరుగుతుందని ఆర్దిక శాఖ అభ్యంతరాలు లేవనెత్తినా పట్టించుకోని రెవెన్యూ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇటీవల మంత్రివర్గం 18 కొత్త రెవెన్యూ డివిజన్లకు సూత్రపాయంగా అంగీకరించింది. ఇదే సమయంలో తాజాగా తొమ్మది మండలాల ఏర్పాటు అంశం
పూర్తి వివరాలు..

విదేశాలు కూడా మన కార్యక్రమాలు అనుసరించడం గర్వకారణం -టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్రంలో మనం చేస్తున్న కార్యక్రమాలు అన్ని దేశాలు గమనిస్తున్నాయి, అనుసరిస్తున్నాయి, ఇది అందరూ గర్వపడాల్సిన అంశంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘‘జన్మభూమి-మాఊరు’’ కార్యక్రమం పై సోమవారం విశాఖపట్నం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మన రియల్ టైమ్ గవర్నెన్స్ దేశానికే కాదు, ప్రపంచానికే నమూనాగా మారడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజి ద్వారా అవినీతి నిర్మూల
పూర్తి వివరాలు..

రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ట్రైనింగ్ యూనిట్, సీఆర్ పీఎఫ్ , రాఫిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ ఫీ ఎస్ ) బెటాలియన్స్ ఏర్పాటు చేస్తాం:కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్

రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ట్రైనింగ్ యూనిట్, సీఆర్ పీఎఫ్ , రాఫిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ ఫీ ఎస్ ) బెటాలియన్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. నేపాల్, జపాన్ లలో నిర్వహించిన రెస్క్యూ ఆఫరేషన్ల లో పాల్గొనడం ద్వారా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్ డీ ఆర్ ఎఫ్ ) కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయని రాజ్ నాథ్ తెలియజేశారు. సోమవారం కృష్ణా జిల్లా కొండపావులూరు
పూర్తి వివరాలు..

ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టడంలేదు: జగన్

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు కూడా కట్టలేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కర్నూలు జిల్లా మహానంది మం. గాజులపల్లిలో రైతు భరోసాయాత్రలో పాల్గొన్న ఆయన.. పంట నష్టపోయిన పసుపు రైతులను పరామర్శించారు. ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టడంలేదన్నారు. 108, ఆరోగ్యశ్రీ ఎక్కడున్నాయో కూడా తెలియడంలేదన్నారు. ఎన్నికల హామీలపై చంద్రబాబును నిలదీయాలని ప్రజలకు జగన్ సూచించారు
పూర్తి వివరాలు..

హోదా ఉద్యమంలో పాల్గొనేవారికి సూచన

ఈ నెల 26న విశాఖ, తిరుపతి, విజయవాడలో జరగనున్న ప్రత్యేకహోదా ఆందోళనల్లో పాల్గొనే వారికి జనసేన పార్టీ కొన్ని సూచనలు చేసింది. రాజకీయ పార్టీలు ఇందులో పాల్గొనవద్దని.. పార్టీ జెండాలు తీసుకురావొద్దని కోరింది. అటు ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కల్గకుండా.. ప్రత్యేకహోదాను తెలియజేసేలా బ్యానర్లు తీసుకువచ్చి శాంతియుతంగా ఆందోళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. ట్యాగ్ లైన్ ఏదైనా గమ్యం, గురి హోదానేనని తెలిపింది
పూర్తి వివరాలు..

చీకట్లో ఉన్న ఏపీకి ప్రత్యేకహోదానే వెలుతురు: వైఎస్సార్ సీనియర్ నేత బొత్స

రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని వైయ్ససార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చట్టసభల్లో పెట్టిన ప్రత్యేకహోదా అంశాన్ని నెరవేర్చాలని తమ అధినేత వైయస్ జగన్ వివిధ రూపాల్లో చేస్తున్న పోరాటానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని అమలు పర్చుకున్న రోజైన 26న శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ చేయాలని పార్టీ నిర్ణయించడం జరిగిందని చెప్పారు. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో
పూర్తి వివరాలు..

హోదా ఇస్తామని చట్టంలో లేదు: చంద్రబాబు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టంలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేసేలా తాను కృషి చేస్తానన్నారు. ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తానని కేంద్రం పేర్కొందన్నారు. ప్రత్యేక హోదా వస్తే.. ప్రత్యేకంగా ఏం వస్తుందో తనకు చెప్పాలని రాష్ట్ర ప్రజలను కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాస్తవాలు గ్రహించి, ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
పూర్తి వివరాలు..

ఈ పోరాటం రేపటి కోసం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని కోరుతున్నట్లు ఏపీ ప్రజా సంఘాలు తెలిపాయి. రేపటి పోరాటం రేపటి తరాల భవిష్యత్తు కోసమని, దీనికి టీడీపీ మరియు బీజేపీ కూడా మద్దతు తెలపాలన్నారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి పోరాడుతుంటే అండగా నిలవక.. ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు.
పూర్తి వివరాలు..

చంద్రబాబుకు పవన్ కౌంటర్

హోదాకై ఆందోళనలు వద్దన్న చంద్రబాబు విజ్ఞప్తిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు. ‘పదిహేనేళ్లు హోదా ఇవ్వాలన్నది మీరే కదా. హోదా సంజీవిని కాదు అద్భుతాలు చేయటానికి అన్నదీ మీరే. ప్యాకేజీకి చప్పట్లు కొట్టింది మీరే. ప్యాకేజీకి చట్టబద్ధత కావాలన్నది మీరే.. అవసరం ఏమన్నదీ మీరే. ఇన్ని అన్నపుడు ప్రజలు విన్నారు. ఇప్పుడు వారి ఆక్రోశం, ఆవేదనను ఒక్కసారి చెప్పుకునే అవకాశం ఇవ్వకపోతే ఎలా’ అని ప్రశ్నించారు.
పూర్తి వివరాలు..

బాబూ నీకెందుకు భయం?:పోలీసులు పచ్చచొక్కాలు వేసుకున్నారా?: ప్రతిపక్షనేతను అడ్డుకుంటారా? : అంబటిరాంబాబు

ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మెడలే కాదు.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మెడలు కూడా వంచి సాధించుకుంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హక్కు కోసం ప్రజలందరూ పోరాడుతుంటే చంద్రబాబు ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్నారని ధ్వజమెత్తారు. బ్రిటీష్‌ పాలనను తలపించే విధంగా హోదా కోసం రోడ్లమీదకు వచ్చిన వారిని అన్యాయంగా అరెస్టులు చేస్తున
పూర్తి వివరాలు..

ఉద్దానం సమస్యపై చంద్రబాబు సమీక్ష

అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ప్రజలు ఎదుర్కొంటున్న మూత్రపిండ వ్యాధి సమస్యపై అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరపాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యపై గురువారం సీఎం నిర్వహించిన సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్‌ శామ్యూల్‌ ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు. మార్చి 15 నాటిక
పూర్తి వివరాలు..

సాధించే వరకు పోరాటం: రఘువీరా

విజయవాడ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు .. సాధించే వరకూ పోరాటం ఆగదని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి పునరుద్ఘాటించారు. ఈ డిమాండ్‌ సాధన కోసం కాంగ్రెస్‌ నిర్వహిచిన మౌన దీక్ష విజయవంతం అయిందని గురువారం రాత్రి విజయవాడలో జారీ చేసిన ప్రకటనలో తెలిపారు. శాంతియుతంగా నిర్వహించిన మౌనదీక్షకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారని ఆరోపించారు. ప్రజల ముందు తెలుగుదేశం, బీజేపీ పార్టీలు
పూర్తి వివరాలు..

విశాఖను తగలబెట్టడానికి అనుమతివ్వాలా?

రాష్ట్రానికి ప్రత్యేకహోదా నిరసనల కోసం విశాఖను తగలబెట్టడానికి అనుమతి ఇవ్వాలా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. హుదూద్ తుఫాన్‌తో నష్టపోయిన విశాఖను వారంలో సాధారణ స్థితికి తీసుకొచ్చామని తెలిపారు. నేరచరిత్ర ఉంది కాబట్టే జగన్ తల్లిని విశాఖ ప్రజలు గెలిపించలేదన్నారు. రిపబ్లిక్‌డే నాడు ఏ రాజకీయ పార్టీ కూడా నిరసనలు చేపట్టలేదని వెల్లడించారు. హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయనే ప్యాకేజీకి ఒప్పుకున్నామన్నారు.
పూర్తి వివరాలు..

ఏపీ సర్కార్ మినీ బీజేపీలా ఉంది: పవన్

ఏపీ ప్రభుత్వం మినీ బీజేపీలా తయారైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం చేతనైతే పోరాడాలి కానీ.. కించపరచకూడదన్నారు. హోదాపై కేంద్రంతో ఎందుకు రాజీపడ్డారో చంద్రబాబు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదావేయగలిగారు అన్న పవన్.. భవిష్యత్తులో ఆపలేరని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు.
పూర్తి వివరాలు..

ప్రత్యేక హోదాతోనే పన్ను రాయితీలు : జేపీ

రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాలను కలుపుకుని కేంద్రంతో చర్చలు జరపాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ జయప్రకాష్‌నారాయణ సూచించారు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి శనివారం విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాలోనే ప్రత్యేక ప్యాకేజీ ఉందనే విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో రెవెన్యూ లోటు
పూర్తి వివరాలు..

కేబినెట్ సమావేశమా-సినిమా ధియేటరా?

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశంలో నందిగామ ఘటనకు సంబంధించిన వీడియోలను చూశామని చెబుతున్న చంద్రబాబు మంత్రివర్గం.. నిజానికి చూడాల్సిన వీడియో అది కాదని, ఇంకా చాలానే ఉన్నాయని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అది కేబినెట్ సమావేశమా.. సినిమా థియటేరా అని ఎద్దేవా చేశారు. విజయవాడలో స్థానిక నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయని దౌర్భాగ్యమైన పని.. రేవంత్ రెడ్డిని
పూర్తి వివరాలు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సమస్యలు క్రియేట్‌ చేస్తున్నారు:చంద్రబాబు

ఏలూరు: రెండున్నరేళ్లలో ఏపీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. అందరూ గర్వపడేలా రాజధాని అమరావతిని నిర్మిస్తామని హామీఇచ్చారు.వెమ్ ఏరో సిటీ నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ నిర్వహించారు. ఆనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘నేను పశ్చిమగోదావరి జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలన్నింటిని శాశ్వతంగా గెలుచుకోవాలనుకుంటున్నాను. అన్ని గెలవాలంటే నేనుగాని మా
పూర్తి వివరాలు..

తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు...మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

©నేడు హోలీ పండుగ సంధర్బంగా రాష్ట్ర సమాచార,పౌర సంబంధాలు, ఐటీ ,తెలుగు భాష,సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ©చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రజల్లో సమైక్యత,సోదరభావాన్ని పెంపొందించే మహోన్నత శక్తి హోలికి ఉంది.. ©ఈ రంగుల పండగ అందరి జీవితాలను వర్ణశోభితం చేయాలనీ, ఈ పండుగ జరుపుకుంటున్న ప్రతిఒక్కరికి శుభం జరగాలన
పూర్తి వివరాలు..

కన్ను మూసిన భూమా నాగిరెడ్డి!

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇకలేరు. నేటి తెల్లవారు జామున తీవ్ర గుండెపోటుతో బాధపడ్డ ఆయనను హుటాహుటీన అనుచరులు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యలు చికిత్స అందించినా ఆయన శరీరం స్పందించకపోవడంతో ఆయన కన్నుమూసినట్టు ప్రకటించారు. మూడుసార్లు ఎంపీగా పని చేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆకస్మిక మృతితో ఆయన అనుచరులు, కార్యకర్తలు, మద్దతు దారులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్
పూర్తి వివరాలు..

‘వైఎస్సార్ సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నా’

హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నామని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆవిర్బావ దినోత్సవంతో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రశంసించారు. ఆయనలేని లోటును పూడ్చే
పూర్తి వివరాలు..