Weekly News

ఆ 500 కోట్లు ఎవరికి దక్కుతాయి

సమాజవాది పార్టీకి బ్యాంకులలో ఉన్న సొమ్ము వ్యవహారంపై ఇప్పుడు రెండు వర్గాల మద్య రచ్చ జరిగే పరిస్థితి ఏర్పడింది.సమాజవాది పార్టీలో మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం సుమారు 500కోట్ల రూపాయల వరకు నిధులు ఉన్నాయి.ఈ డబ్బు వాడకుండా ప్రస్తుతానికి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని అఖిలేష వర్గం బ్యాంకులను కోరినట్లువార్తలు చెబుతున్నాయి.ప్రస్తుతం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాబాయి అయిన రాష్ట్ర పార్టీ అద్యక్షుడు శ
పూర్తి వివరాలు..

జగన్ ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఫలితం ఉండదు: దేవినేని

అమరావతి : చిత్తశుద్ది లేని జగన్ ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఫలితం ఉండదు - అవినీతి పాపాలు జగన్ ను వెంటాడుతూనే ఉంటాయి - శ్రీశైలంలో కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడారు - పైనుంచి వరద రాకపోయినా రాయలసీమకు నీటి పంపిణీ జరిగింది - 128 టీఎంసీలు రాయలసీమకు పంపితే జగన్ కు కనపడలేదా? - పట్టిసీమ ఫలితాన్ని సార్థకం చేసి చూపాం - జగన్ అజ్ఞానంపై రాయలసీమ ప్రజలు నవ్వుకుంటున్నారు - రికార్డు స్థాయిలో పురుషోత్తపట్నం పూర్తిచే
పూర్తి వివరాలు..

రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పరిటాల సునీత

శ్రీకాకుళం: బలగ, బొందిపురంలో మంత్రి పరిటాల సునీత ఆకస్మిక తనిఖీ – రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పరిటాల సునీత – చంద్రన్న సంక్రాంతి కానుక సరకులను పరిశీలించిన మంత్రి పరిటాల – నిన్నటి నుంచి సర్వర్లు బాగానే పనిచేస్తున్నాయి – 50 శాతం వరకు చంద్రన్న సరకులు పంపిణీ చేశారు – ఒకట్రెండు రోజుల్లో మిగిలిన వారికి అందిస్తాం: మంత్రి పరిటాల సునీత
పూర్తి వివరాలు..

ములాయంకు అఖిలేష్ మరో షాక్

యూపీ : ములాయంకు అఖిలేష్ మరో షాక్ - సమాజ్ వాదీ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకులను కోరిన అఖలేష్ వర్గం? - శివపాల్ యాదవ్ చేతిలో సమాజ్ వాదీ పార్టీ బ్యాంకు ఖాతాలు - సమాడ్ వాదీ పార్టీ ఖాతాల్లో రూ.500 కోట్లు ఉన్నట్లు అంచనా
పూర్తి వివరాలు..

ఉత్తర ద్వార దర్శనం కోసం మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లో సాంప్రదాయ ఏర్పాట్లు

మంగళగిరి:వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లో సాంప్రదాయ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఇందులో భాగంగా తంజావూరు మహారాజులు సమర్పించిన దక్షిణామృత పంచలోహ శంఖంతో ఉదయం 2 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు తీర్థం ఇవ్వనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారు
పూర్తి వివరాలు..

ఎమ్మెల్సీ బీచ్ పార్టీపై బాబు సీరియస్..

విజయవాడ: సూర్యలంక ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇవాళ ఉదయం పార్టీ నేతలతో సమావేశమైన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలు తెప్పించుకున్నారు. వెంటనే వచ్చి తనను కలవాలని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌కు ఆదేశాలిచ్చారు. కంప్లైంట్ చేయడానికి వెళ్లిన బాధితుడిని అదుపులోకి తీసుకుని, ఈ రోజు ఉదయం వరకూ బాధితుడిని అదుపులో ఉంచుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని పరిశీలించి పోలీసులపై చర్య తీసుకోవాలని ఉన్నతాధికారుల
పూర్తి వివరాలు..

సీసీ రోడ్డులు, డ్రైన్లకు శంకుస్థాపన

జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట మండలం రామచంద్రపురం గ్రామంలో 18 లక్షల రూపాయలతో సీసీ రోడ్డులు, డ్రైన్లకు శంకుస్థాపన చేసిన వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపటి పుల్లారావు.
పూర్తి వివరాలు..

విద్యార్థులకు అస్వస్థత

కంచికచెర్ల మండలం గండేపల్లి గ్రామంలో CSI ప్రాథమిక పాఠశాల లో మద్యనం భోజనం చేసిన తర్వాత పది మంది విద్యార్థులకు అస్వస్థత కాలు చేతులు కొంగలు పోవడం తో నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు
పూర్తి వివరాలు..

నగరానికి చేరుకున్న చిరంజీవి

అమరావతి :ఖైదీ నంబరు 150 సినిమా ప్రీరిలీజ్ లో పాల్గొనడానికి చిరంజీవి విజయవాడ చేరుకున్నారు గన్నవరం ఎయర్ పోర్ట్ లో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు
పూర్తి వివరాలు..

నా సినిమా తో పాటు అన్ని సినిమాలు విజయవంతం అవ్వాలి : చిరంజీవి

ఖైదీ నం.150 ’ ద్వారా మరోసారి ప్రేక్షకుల దగ్గరకు వస్తుండటం ఆనందంగా ఉందని చిరంజీవి చెప్పాడు. ఈ సందర్భంగా ఇంద్ర సినిమాలోని డైలాగ్‌ను మార్చి ‘ఢిల్లీకి పోయాడు డాన్స్ మర్చిపోయాడు. హస్తినకు పోయాడు హాస్యాన్ని వదిలేశాడు. ఈ మధ్య మా మధ్య లేడు మాస్‌ను మర్చిపోయాడు అనుకున్నారా? అదే మాస్, అదే గ్రేస్. అదే హోరు.. అదే జోరు’ అని తన రీ ఎంట్రీని చిరంజీవి వివరించాడు.  పూర్తి వివరాలు..

రేణిగుంట చేరుకున్న ప్రధాని మోదీ

తిరుపతి : సైన్స్ కాంగ్రెస్ సదస్సు కోసం తిరుపతికి బయలుదేరిన ప్రధాని నరేంద్రమోదీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత ఆయన తిరుమలకు రావడం ఇది రెండోసారి. మోదీ మంగళవారం తిరుమల తిరుపతిలో పర్యటించనున్నారు. 104వ సైన్స్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆయన తిరుపతి వస్తున్నారు.
పూర్తి వివరాలు..

రేపటి నుంచి కార్డులు అంగీకరించరు

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులను అంగీకరించకుండా, కేవలం నగదును మాత్రమే పెట్రోల్ బంకులు స్వీకరిస్తాయట. కార్డు ద్వారా జరిపే ప్రతి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం ఛార్జి వసూలు చేయడం, దీనిపై ఆయిల్ కంపెనీలు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక పెట్రోలియం ఫెడరేషన్ పెట్రోలియం అధ్యక్షుడు రవీంద్రనాథ్ వెల్లడించారు. నగదు కొరత ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభావం ఎలా ఉంటుందో!
పూర్తి వివరాలు..

కిలో చికెన్ 900 :

మధ్యప్రదేశ్‌కు చెందిన ‘కడక్‌నాథ్‌’ అనే ప్రత్యేక జాతి కోడి మాంసం ధర మాత్రం జోరుగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఈ కోడి మాంసం కిలో రూ.900కు హాట్‌ కేకులా అమ్ముడవుతోంది. బిగ్‌బాస్కెట్‌ వంటి ఆన్‌లైన్‌ సైట్స్‌లోనూ చాలా కాలంగా ఈ కోళ్ల అమ్మకం జరుగుతోంది. కోడి, మాంసం, ఎముకలు నల్లగా ఉండటమే ఈ కోడి ప్రత్యేకత. బ్రాయిలర్‌ కోళ్ల లాగా ఈ కోళ్ల పెంపకం కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు. రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వా
పూర్తి వివరాలు..

నల్లధనం-నగదు రహితంపై RBI మాజీ గవర్నర్ వైవీ రెడ్డి దిమ్మతిరిగే ప్రశ్న

నల్లధనం, నగదు రహితంపై వైవీ రెడ్డి దిమ్మతిరిగే ప్రశ్న నగదు రహిత లావాదేవీలతో నల్లధనం నిర్మూలిస్తామని ప్రధాని మోదీ చెబుతున్న వేళ ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన క్యాష్‌ లెస్ అయినంత మాత్రాన నల్లధనం పోతుందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలోని నల్లధనం విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి తెల్ల ధనం రూపంలో వస్తోందని… అదంతా ఏమైనా సూట్‌కేసుల్లో
పూర్తి వివరాలు..

గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటా

పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్, మాజీ ఐపిఎస్ అదికారి కిరణ్ బేడీకి పదవిపై మొహం మొత్తినట్లుంది. 2018 నాటికి పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటన చేశారని కధనం.వచ్చే ఏడాది మే ఇరవైతొమ్మిది నాటికి తాను గవర్నర్ పదవి నుంచి వైదొలగుతానని ఆమె ఒక వార్తా సంస్థకు వెల్లడించారు. అప్పటికి తాను పదవిలోకి వచ్చి రెండేళ్లు అవుతుందని, తర్వాత కొనసాగనని ఆమె చెప్పారు.కాంగ్రెస్ ముఖ్యమంత్రి నారాయణస్వామితో వచ్చిన విబేధాల కారణంగ
పూర్తి వివరాలు..

గుజరాత్‌లో రూ.871 కోట్ల బ్లాక్ మనీ?

గుజరాత్ రాజ్‌కోట్‌లోని ఓ సహకార బ్యాంకు కేంద్రంగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు. గతేడాది నవంబర్ 9- డిసెంబర్ 30 మధ్య రూ.871 కోట్ల మేర పాతనోట్లు డిపాజిట్లు చేసినట్లు తెలిపారు. ఈ నగదు జమ కోసం 4,500 కొత్త అకౌంట్లు ఓపెన్ చేయగా, 62 ఖాతాలకు ఒకటే ఫోన్ నంబర్ ఇచ్చారని తెలిపారు. 25 సార్లు భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేశారని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
పూర్తి వివరాలు..

రాజ్ నాథ్ సింగ్ కు స్వాగతం చెప్పిన ముఖ్యమంత్రి

గన్నవరం విమానాశ్రయం లో కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి దేవినేని ఉమా, ఎంపీ లు కేశినేని శ్రీనివాస్, కే.నారాయణ, ఎమ్మెల్యే వంశీ, డీజీపీ ఎన్. సాంబశివరావు తదితరులు ఉన్నారు.
పూర్తి వివరాలు..

• డిజి ధన్ మేళాలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

అమరావతి : • డిజి ధన్ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు • ఎన్ పీ సీఐ స్టాల్ , ఆధార్ కేంద్రాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
పూర్తి వివరాలు..

అన్ని స్టాల్స్ పపరిశీలిస్తున్న చంద్రబాబు

అమరావతి : • సివిల్ సప్లయ్, ఏపీఎస్ ఆర్ టీసీ, డీ ఆర్ డీఏ స్టాల్స్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు • నగదు రహిత లావాదేవీలతో రేషన్ పంపిణీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి • ముఖ్యమంత్రితో పాటు స్టాల్స్ ను పరిశీలిస్తున్న మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, కలెక్టర్ బాబు
పూర్తి వివరాలు..

బిర్యానీని కూడా నిషేధించండి: కమల్

జల్లికట్టు ఆట వద్దనే వాళ్లు బిర్యానీ తినడం కూడా నిషేధించాలని హీరో కమల్‌హాసన్‌ అన్నారు. తనకు జల్లికట్టు అంటే ఎంతో ఇష్టమని.. జల్లికట్టు ఆడిన కొద్దిమంది నటుల్లో తానూ ఒకడినన్నారు. తమిళుడిని అయినందుకు గర్విస్తానని, జల్లికట్లు ఆడటం తమ సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. కాగా జల్లికట్టు ఆటను తమిళనాడు రాష్ట్రంలో నిషేధించిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలు..

నోబుల్‌ ప్రైజ్‌ అంటే చంద్రబాబుకు తెలుసా

ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నారాయణ-చైతన్య విద్యాసంస్థల్లో ఎక్కువమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘాలు కూడా ఈ విషయంపై ఆలోచించాలని శ్రీకాంత్‌ రెడ్డి సూచించా
పూర్తి వివరాలు..

సమాజ్ వాది పార్టీ సి యమ్ అభ్యర్థిగా అఖిలేష్

సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న ముసలం ముగిసిపోయింది. ఎస్పీ సీఎం అభ్యర్థిగా CM అఖిలేష్ యాదవ్‌ను పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. పార్టీ వీడిపోయేది లేదన్న ఆయన.. తమలో ఎలాంటి విభేదాలు లేవని, త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు.
పూర్తి వివరాలు..

మళ్లీ బీజేపీ అధికారంలోకి రాదు...కాంగ్రెస్ కి అవకాశాలు ఉన్నాయి;ప్రత్యేక హోదాపై చంద్ర‌బాబు ఒక్కో సమయంలో ఒక్కోలా మాట్లాడుతున్నారు : చిరంజీవి విమర్శలు

2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవుతుందని ప్రముఖ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి తెలిపారు. ఖైదీ నెంబర్ 150 ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ, డీమానిటైజేషన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేసిన పనితో దేశంలో నల్లధనం లేదని బయటపడిందని ఆయన చెప్పారు. 15 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ వినియోగంలో ఉందని ఆర్బీఐ ప్రకటించిందని, అందులో 14 లక్షల కోట్ల పైచిలుకు మొత
పూర్తి వివరాలు..

ఈ నెల 12 నుంచి విజయవాడలో ఎయిర్ షో

ఈ నెల 12 నుంచి విజయవాడలో ఎయిర్ షో జరగనుంది. బ్రిటన్‌కు చెందిన విమానాలు విన్యాసాలతో ఆకట్టుకోనున్నాయి. నగరంలోని పున్నమి ఘాట్ ఈ షోకు వేదిక కాగా ఈ నెల 12 నుంచి ఎయిర్ షో ప్రారంభం కానుంది. ఆ రోజున సాయంత్రం 04.15 నుంచి 04.45 వరకు జరగనుండగా.. జనవరి 13, 14 తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండుసార్లు షో జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11.15 నుంచి 11.45 వరకు, సాయంత్రం 04.15 నుంచి 04.45 వరకు ఈ షో జరగనుంది.
పూర్తి వివరాలు..

ఫ్లాష్: బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక

పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జరిగిన లావాదేవీలపై IT, ED ప్రత్యేకంగా దృష్టి సారించాయి. దేశ వ్యాప్తంగా 60 లక్షల ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరగగా.. డిపాజిటైన నగదుపై ఖాతాదారులు సరైన వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటారట. అటు పన్ను కట్టని సొమ్ము ₹4 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా పలు అకౌంట్లలో ఖాతాదారులకు తెలియకుండా డబ్బు డిపాజిటై మాయమవడంపై ఏంచేస్తారో మరి?
పూర్తి వివరాలు..

రూ.799కే విమాన టికెట్లు

విమానయాన ప్రయాణికులకు ఎయిర్ ఏషియా ఆఫర్లు ప్రకటించింది. ‘2017 ఎర్లీ బర్డ్‌ సేల్‌’ పేరుతో ప్రారంభ ధర రూ.799కే టికెట్ అందిస్తున్నట్లు వెల్లడించింది. 2017 మే 1 నుంచి 2018 ఫిబ్రవరి 6 వరకు ప్రయాణించేవారికి ఈ ఆఫర్‌ వరిస్తుందని, జనవరి 15న ఆఫర్‌ ముగియనుందని తెలిపింది. > బెంగళూరు-కొచ్చి ₹999 > ఇంఫాల్‌-గౌహతి ₹799 > కొచ్చి-హైదరాబాద్‌ ₹1,499 > హైదరాబాద్‌-గోవా ₹1499 > ఛండీగఢ్‌-బెంగళూరు ₹2,999
పూర్తి వివరాలు..

లెక్కల్లో చూపని ఆదాయం జమ: ఐటి గుర్తింపు

దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో డిపాజిట్లను ఆదాయ పన్ను శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.. బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో లెక్కలు చూపని ఆదాయం జమైందని గుర్తించారు.. పన్ను చెల్లించని సొమ్ము విలువ సుమారు రూ.4లక్షల కోట్లు ఉంటుందని ఐటి శాఖ వెల్లడించింది.. రూ.10,700 కోట్లు ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాల్లో జమైనట్టు గుర్తించారు. మొత్తం 80 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాల్లో ఎక్కువ సొమ్ము జమైందని, పేర్కొన్నారు.. నవ
పూర్తి వివరాలు..

అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే: బాబు

ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. చెన్నైలో ఇండియాటుడే సదస్సులో పాల్గొన్న ఆయన.. మరో 20 రోజుల్లో అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం లేఖపై స్పందిస్తూ ప్రస్తుతం కృష్ణా నదిలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉందని.. పరిస్థితిని బట్టి చెన్నైకి నీరందించే అవకాశాలు పరిశీలిస్తామన్నారు.
పూర్తి వివరాలు..

హైద్రాబాద్ లో ఏపీ రిజిస్ట్రేషన్ వాహానాలు లక్ష

జూన్ 2, 2014కు ముందు ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను మార్చుకునేందుకు వీలుగా రాష్ట్ర రవాణా శాఖ ఆన్‌లైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు వాహనాల రిజిస్ట్రేషన్ ఏపీ పేరుతో వచ్చాయి. ఇప్పుడు టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రవాణాశాఖ స్పష్టం చేసింది. ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న నంబర్ ప్లేట్లను మార్చుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇంతకు ముందే జారీ చేసింది. అయితే
పూర్తి వివరాలు..

ప్రేమజంటలు విడిపోయిన తర్వాత రేప్ కేసు పెట్టడం ఒక ట్రెండ్ అయిపోయింది! ::బాంబే హైకోర్టు

ప్రేమజంటలు విడిపోయిన తర్వాత రేప్ కేసు పెట్టడం ఒక ట్రెండ్ అయిపోయింది!: బాంబే హైకోర్టు పెళ్లికంటే ముందు పరస్పర అంగీకారంతో జరిగిన శృంగారాన్ని చదువుకున్న ఆడపిల్లలెవరూ రేప్ అని అనరని, తద్వారా ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి ముందే తెలుసు కనుక, ఎవరి నిర్ణయానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని, తర్వాత వదిలేశాడంటూ 21
పూర్తి వివరాలు..

ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు ఖరారు

యూపీలో సమాజ్ వాది పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తులు ఖరారయ్యాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 105సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకారం తెలపడంతో ఈ సందిగ్ధతకు తెరపడినట్లయింది. తాము అడిగినన్నీ సీట్లు ఇవ్వకుంటే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ తేల్చిచెప్పడంతో ఎస్పీ దిగిరాక తప్పలేదు. కాగా 403అసెంబ్లీ సీట్లు గల యూపీలో 298సీట్లలో ఎస్పీ పోటీ చేయనుంది.
పూర్తి వివరాలు..

వారంతా త్వరగా కోలుకోవాలి: మోదీ

విజయనగరం జిల్లాలో జరిగిన హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం చాలా బాధాకరమన్న ఆయన.. గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. అటు మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పూర్తి వివరాలు..

టీడీపీ ఎంపీ రాయపాటి పై పవన్ ఆగ్రహం

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం గుత్తేదారు కంపెనీ ‘ట్రాన్‌స్ట్రాయ్’ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డ్‌గా మార్చేస్తే ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తారో అన్న వివేకం కూడా చూపకపోతే ప్రజాప్రతినిధులను ఏమనుకోవాలని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణ ప్రగతిపై నెలకోమారు సమీక్ష జరుపుతున్న సర్కార్ ఈ సమస్యపై ఎందుకు దృష్టిపెట్టడం లేదో అర్థం కావడం లేదని పవన్ అన్నారు. ‘ఈ భూముల రైతులు తమ
పూర్తి వివరాలు..

ప్రత్యేకహోదా ఇచ్చేది మేమే: రఘువీరా రెడ్డి

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ఆ పార్టీ చీఫ్ రఘువీరారెడ్డి తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. హోదా ఇవ్వకుండా బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్ లేకపోతే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అటు కాంగ్రెస్ పార్టీ ఫోనిక్స్ పక్షి లాంటిదని.. పార్టీ జెండా కూడా తిరిగి రాష్ట్రంలో తప్పకుండా ఎగురుతుందన్నారు
పూర్తి వివరాలు..

మళ్ళీ మొదలవుతున్న ‘హోదా’ ఉద్యమం

నివురుగప్పిన నిప్పులా ఉన్న ‘ప్రత్యేక హోదా’ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు నిషేధించిన జల్లికట్టును తమిళ ప్రజలు పోరాడి సాధించుకోవటంతో కేంద్రం హామీ ఇచ్చిన హోదానూ పోరాడి పొందాలని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. జనవరి 26న విశాఖ వేదికగా ప్రజా స్పందన చూపుదామని సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ అవుతోంది. పోరాడితే పోయేదేముంది.. ఏపీకి ఉన్న ఆర్థిక కష్టాలు తప్ప!
పూర్తి వివరాలు..

M P లు రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుంది:భూమన కరుణాకర రెడ్డి

తమిళుల జల్లకట్టు ఆర్డినెన్స్ తో ఎపిలో మళ్లీ ప్రత్యేక హోదా అంశం జనంలోకి వస్తోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించగా, కాంగ్రెస్ ఎమ్.పి కెవిపి రామచంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసి ఏకంగా రాష్ట్రానికి చెందిన ఇరవై ఐదు మంది ఎమ్.పిలతో రాజీనామా చేయిద్దామని ప్రతిపాదించింది.ఆ పార్టీ ప్రదాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తమిళులు జల్లిక
పూర్తి వివరాలు..

విశాఖ ఆందోళనకు మద్ధతిస్తున్నా: పవన్

ఈ నెల 26న విశాఖలో జరగనున్న ప్రత్యేకహోదా ఆందోళనకు మద్ధతిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆర్కే బీచ్‌లో ప్రశాంతంగా తమ నిరసనలు చేస్తామని ఆ సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన.. అవకాశవాద రాజకీయాలు, వేర్పాటు వాద, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను ఆ రోజు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అటు ఈ ఆందోళన కారణంగా తన కాటమరాయుడు టీజర్ వాయిదా వేస్తున్నట్లు చెప్పారు
పూర్తి వివరాలు..

జల్లికట్టు కు,,హోదాకు సంబందం ఏమిటి?-బాబు

జల్లికట్టు ఉద్యమానికి,ప్రత్యేక హోదాకు సంబందం ఏమిటని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా అని ఆయన అన్నారు. విశాఖను తాను ఎంతో అభివృద్ది చేశానని, హుద్ హుద్ తుపాను వస్తే ఏమయిపోతుందో అనుకున్నదానిని తాను ఎంతో అభివృద్ది చేశానని ఆయన అన్నారు.యువత కూడా అర్దం చేసుకోవాలని , విశాఖలో కాగడాల ఉద్యమం అవసరం ఏమిటని ఆయన అన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి కొందరు
పూర్తి వివరాలు..

ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తి ర్యాలీ లో పాల్గొన్న రోజా

గత రెండేళ్ళలో రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. హోదా వద్దంటున్న సీఎం.. ప్యాకేజీలతో ఏం జరుగుతుందో స్పష్టత ఇవ్వాలన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును ఫణంగా పెట్టవద్దని హోదాకై చిత్తూరులో జరిగిన కాగడాల ర్యాలీలో హితవు పలికారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ముఖ్యమంత్రి మర్చిపోవద్దన్నారు
పూర్తి వివరాలు..

ప్రకాశం బ్యారేజ్ పరిధిలో 144 సెక్షన్

విశాఖపట్నంతో పాటు హోదాకై నిరసనలు చేపట్టే విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. బ్యారేజ్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. సమీప ప్రాంతాల నుంచి ముందస్తుగానే విజయవాడకు యువత చేరే అవకాశం ఉండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ తనిఖీలు జరుపుతున్నారు. అటు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ పరిసరాల్లోనూ దాదాపు ఇదే తరహా పరిస్థితులున్నాయి.
పూర్తి వివరాలు..

కొవ్వొత్తుల ర్యాలీకి వెళతా-జగన్

ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో జరుగుతున్న కొవ్వొత్తుల ర్యాలీ కి తాను స్వయంగా హాజరు అవుతానని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఇందులో పాల్గొనాలని ఆయన అన్నారు.ఒకవేళ అరెస్టు చేయదలిస్తే దానికి కూడా సిద్దమని ఆయన స్పష్టం చేశారు. జూన్ వరకు చూస్తామని, ఆ తర్వాత తమ పార్టీ ఎమ్.పిలు రాజీనామా చేస్తారని ఆయన ప్రకటించారు.తమిళనాడులో జల్లికట్టు కోసం ముఖ్యమంత్రి
పూర్తి వివరాలు..

జగన్ ఎస్కార్టు వాహనాల సీజ్

విశాఖలో మౌన ప్రదర్శనకు బయల్దేరిన జగన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఎస్కార్టు వాహనాలను విశాఖ సమీపంలో పోలీసులు సీజ్ చేశారు. యువత అనుమతి లేనందున అక్కడకు వెళ్ళవద్దని జగన్ వర్గీయులకు విజ్ఞప్తి చేశారు. అటు ఇతర ప్రాంతాల్లోనూ పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాలు..

వెళ్లి పందుల పందేలు ఆడుకోండి.. కేంద్ర మంత్రి సుజనా వ్యాఖ్యలు!

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు స్ఫూర్తి కావాలనుకుంటే వెళ్లి అదే ఆడుకోవాలని సుజనా ఎద్దేవా చేశారు. లేకపోతే కోళ్ల పందెలు, పందుల పందేలు ఆడుకోవచ్చని సుజనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చంద్రబాబు చూస్తూ ఊరుకోరని, రాష్ట్రానికి ఏ సెక్షన్ కింద ఏ రూల్ కింద అన్యాయం జరిగిందో చెబితే సమాధానం చెబుతానని ఆయన సవాల్ చేశ
పూర్తి వివరాలు..

విశాఖలో వేదిక మారిందా? ఆర్కే బీచ్ కాదా?

తమిళ యువత జల్లికట్టు కోసం చేసిన ఆందోళనకు కేంద్రం దిగొచ్చింది. ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. మెరీనా బీచ్‌లో లక్షలాది మంది యువత చేపట్టిన పోరాటానికి ఫలితం దక్కింది. తమిళుల స్పూర్తితో ఏపీ యువత కూడా ప్రత్యేక హోదాపై నిరసన గళం వినిపించేందుకు సిద్ధమైంది. ఇవాళ విశాఖలోని ఆర్కే బీచ్‌లో మౌన దీక్ష ద్వారా కేంద్రానికి తమ వాదనను వినిపించేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటోంది. అయితే సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఈ ఆంద
పూర్తి వివరాలు..

విశాఖకు బయలుదేరిన వైయస్ జగన్

వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విశాఖ బయలుదేరారు. ఇందుకోసం కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో వైయస్ జగన్ పాల్గొంటారు. ప్రత్యేక హోదా కోసం వైయస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలు..

క్యాండిల్‌ ర్యాలీకి రూట్‌ మ్యాప్‌

ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రిపబ్లిక్‌ డే రోజున క్యాండిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో జరగనున్న ఈ కార్యక్రమానికి పార్టీశ్రేణులు, ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే కార్యకర్తల కోసం పార్టీ కేంద్ర కార్యాలయం దిశా నిర్దేశం చేసి రూట్‌ మ్యాప్‌ను సిద
పూర్తి వివరాలు..

విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వే బైఠాయించిన వైయస్ జగన్

విశాఖపట్నంః వైయస్ జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో రన్ వై పేనే వైయస్ జగన్ ను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా వైయస్ జగన్ రన్ వేపై బైఠాయించారు. అధినేత వెంట పార్టీ నేతలు వి. విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు ఇతర నేతలు ఉన్నారు. విశాఖ ఆర్కే బీచ్ లో క్యాండిల్ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది.
పూర్తి వివరాలు..

హోదా మా శ్వాస: జగన్

ప్రత్యేకహోదా అనేది తమ శ్వాస అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. హోదా పోరాటం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. జల్లికట్టు స్ఫూర్తితో హోదా సాధించుకుందామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ప్రత్యేకహోదాకు మద్దతుగా శుక్రవారం ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పూర్తి వివరాలు..

పవన్‌ కల్యాణ్ పార్టీ పేరు నాకు తెలీదు: జయసుధ

తన సమకాలిన హీరోయిన్లలో చాలమంది రిటైరైపోయినా.. ఇప్పటికీ సినిమాల్లో తన సహజనటనతో మెప్పిస్తోంది జయసుధ. ఇప్పటికీ తీరిక లేకుండా సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న జయసుధ రాజకీయాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘మీరు భవిష్యత్తులో ‘జనసేన’లో జాయిన్‌ అవుతారా?’ అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఆ పార్టీ ఎవరిదని ప్రశ్నించింది. ‘పవన్‌ పార్టీ పేరు ‘జనసేన’ అని నాకు తెలియదు.
పూర్తి వివరాలు..

భారత్ వచ్చినవారు AP వైపు చూడాలి

ప్రపంచం భారత్ వైపు చూడాలి, భారత్ వచ్చినవారు ఏపీ వైపు చూడాలని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే ఏడాది వరకు రాష్ట్రంలో 15% వృద్ధి సాధించాలనేదే తమ లక్ష్యమని విశాఖలో జరుగుతున్న CII సదస్సులో పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వరల్డ్ టాప్-10లో ఏపీ ఉండాలన్న బాబు.. గ్యాస్, ఆయిల్ నిక్షేపాలతో రాష్ట్రం సంపన్న కావడం ఖాయన్నారు.
పూర్తి వివరాలు..

ప్రాజెక్టుల అవినీతిపై కమిటీ వేయాలి: పవన్

రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై సీఎం చంద్రబాబు నిపుణుల కమిటీ వేయాలని పవన్ డిమాండ్ చేశారు. రాయపాటి, సుజనా చౌదరి లాంటి నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ, బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టారనే వాదనలను కమిటీ వేసి నిరూపించాలన్నారు. హోదా కోసం పోరాడే ప్రజలను వ్యతిరేకిస్తూ మాట్లాడేందుకు సుజనా చౌదరి ఎవరని... ప్రజలను అడిగే హక్కు ఆయనకు ఎక్కడిదని సూటిగా ప్రశ్నించారు.
పూర్తి వివరాలు..

రైతు ఆత్మహత్యలకు కారణాలేంటి?: సుప్రీం

దేశవ్యాప్తంగా రైతులు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైతు ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించి.. నాలుగు వారాల్లోగా నివేదిక అందజేయాలని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఓ ఎన్జీవో వేసిన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం ఇలా స్పందించింది.
పూర్తి వివరాలు..

ఆశావహులకు శుభవార్త

అమరావతి : తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే ఆశావహులకు కేంద్రం తీపి కబురు అందించింది.విభజన చట్టం లో హామీ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాలను 225గా తెలంగాణా లో 119 స్థానాలను 153గాపెంపొందించడానికి వీలుగా పార్లమెంటు లో బిల్లుపెట్టేందుకుశ్రీకారంచుట్టింది.దీనికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపమని ఏ.పి ,తెలంగాణా లను కేంద్ర న్యాయ శాఖ కోరింది
పూర్తి వివరాలు..

ఉత్తర ప్రదేశ్ లో BJP సునామీ:ఒమర్ అబ్దుల్లా

ఉత్తరప్రదేశ్‌లో భాజపా సునామీ సృష్టించిందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ప్రతిపక్షాలు ఇక 2019 ఎన్నికలు మర్చిపోయి 2024 ఎన్నికలపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. యూపీలో భాజపా భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే 2024 ఎన్నికల్లో తమ వ్యూహాలను మార్చుకుంటేనే భాజపాకు గట్టి పోటీ ఇవ్
పూర్తి వివరాలు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ వాయిదా

అమరావతి: నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి మృతికి సంతాపంగా రేపు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. దీంతో రేపు ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశమై భూమా మృతికి సంతాపం ప్రకటించి.. తర్వాత వాయిదా పడనున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి బడ్జెట్‌ ఎప్పుడు ప్రవేశపెట్టాలన్న దానిపై చర్చించనున్నారు. భూమా నాగిరెడ్డి అకాల మృ
పూర్తి వివరాలు..

శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న యనమల

రాజధాని అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈరోజు తొలి బడ్జెట్‌ శాసనసభలో ప్రవేశపెడుతోంది. దాదాపు రూ.1.55లక్షల కోట్ల స్మార్ట్‌ బడ్జెట్‌ పద్దును రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రలో నిర్మించిన తాత్కాలిక శాసనసభలో ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్‌ ఇదే కావడం విశేషం. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోది
పూర్తి వివరాలు..

బడ్జెట్ విశేషాలు

బడ్జెట్ విశేషాలు ■ఏ పి బడ్జెట్ 1,56,999 కోట్లు ■ రెవెన్యూ 1,25,911 కోట్లు ■నిర్వహణ 31087 కోట్లు ■సంక్షేమం 1234 కోట్లు ■సాంస్కృతిక శాఖకు 78 కోట్లు ■క్రీడలుమరియు యువజన సర్వీసులు 1005 కోట్లు ■పర్యావరణం 4813 కోట్లు
పూర్తి వివరాలు..

అగ్రాసనం అద్వానీకే!

భారతీయ జనతా పార్టీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి కాబోతున్నారా? సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆయనను బలపరుస్తున్నారా? మోదీ తన గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవిని ఇవ్వబోతున్నారా? గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపినట్లు సమాచారం. ఈ సమావేశానికి అద్వానీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేశూభాయ్ పటేల్‌ కూడా
పూర్తి వివరాలు..

ప్రత్యేక ప్యాకేజి కు చట్టబద్ధత

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్ధత లభించింది. కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా దీన్ని ఆమోదించింది. పోలవరానికి వంద శాతం నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక హోదా వల్ల లభించే ప్రయోజనాలన్నీ విదేశీ రుణాల ప్రాజెక్టులకు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ప్రత్య
పూర్తి వివరాలు..

పోలవరంపై అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ

అమరావతి: పోలవరంపై అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరుగింది. మంత్రి దేవినేని ఉమ పోలవరంపై కేంద్ర కేబినెట్ ఇచ్చిన నోట్‌ని చదివి వినిపించారు. జగన్ ఆరోపణలకు ఉమ ధీటుగా జవాబిచ్చారు. మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చెప్పిన తర్వాత హోంమంత్రిత్వ శాఖ నోట్ పంపిస్తే మార్చి 2, 2014న కేబినెట్ సమావేశంలో ఆ నోట్‌ను తిరస్కరించి వచ్చే పార్లమెంట్‌లో పెట్టాలని డిక్లైన్ చేసి పంపించిందన్నారు. రాష్ట్ర ప్రజలకు మాత్రం.. రాష్ట్రపతి వద్
పూర్తి వివరాలు..

మంత్రులు ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు:జగన్

అసెంబ్లీ‌: ఇంగితజ్ఞానం లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని, అలాంటివారు మంత్రులుగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రాకముందే పోలవరానికి రూ.5,500 కోట్లు ఖర్చు చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం మూడేళ్లలో రూ. 3 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని జగన్ అన్నారు. పోలవరం ఇప్పటిదే అన్నట్టు టీడీపీ నేతలు మాట్
పూర్తి వివరాలు..

ఏపీ శాసనసభలో గందరగోళం

అమరావతి: వైకాపా సభ్యుల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో గందరగోళం నెలకొంది. స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.దీంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు స్పందిస్తూ విపక్ష సభ్యులు సంప్రదాయాలు పాటించాలని..సభ సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభా సజావుగా సాగకుండా చేయడం సరికాదని భాజపా శాసనసభాపక్ష విష్ణుకుమార్‌రాజు అన్నారు.
పూర్తి వివరాలు..

పోలవరానికి చట్టబద్ధతకు ధన్యవాదాలు

అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు చట్టబద్ధత, నూరుశాతం నిధులు ఇచ్చేందుకు అంగీకరించిన కేంద్రానికి ఏపీ ప్రజల తరపున సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలవరం ఎలా పూర్తి చేయాలి అనే విషయాన్ని చట్టంలో పెట్టలేదని తెలిపారు. రాష్ట్రం కోసం 56సార్లు కేంద్రంలో ఉండే ముఖ్యులను కలిసినట్లు వివరించారు. ప్రధానిని 10సార్లు, హోంమంత్రిని 16 సార్లు, ఆర్థిక మంత్రిని 18 సార్లు కలిస
పూర్తి వివరాలు..

ప్రత్యేక ఆర్థిక సాయంపై చంద్రబాబు ప్రకటన

అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటనను ప్రతిపక్షం అడ్డుకున్నాయి. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలే అంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపాయి. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన చట్టబద్ధ హామీని చంద్రబాబు తుంగలోకి తొక్కారని
పూర్తి వివరాలు..

ఆర్ఎస్ఎస్ ప్రతిపాదనకు ముస్లింల మద్దతు

ఉత్తరప్రదేశ్‌ లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఏవిధంగా విజయం సాధించిందని మత పెద్దలతో పాటు ప్రత్యర్థులు బుర్రలకు పదునుగా పెడుతుండగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీని వెనుకుండి నడిపించే ఆర్ఎస్ఎస్ ప్రతిపాదనకు భారీ సంఖ్యలో ముస్లింలు మద్దతు తెలిపారు. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) చేపట్టిన సంతకాల కార్యక్రమానికి అనూహ్య స
పూర్తి వివరాలు..

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ హల్‌చల్‌

కడప : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్‌ శుక్రవారం జమ్మలమడుగులో హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే అనుమతి లేదంటూ ఎంపీని పోలీసులు వెనక్కి పంపారు. మరోవైపు రాజంపేటలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఓటుహక్కు లేని టీడీపీ నేతలను పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించారు. దీనిపై ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు అభ్యంతరం
పూర్తి వివరాలు..

కొత్త సంస్కృతి కి పవన్ కళ్యాణ్ తెర లేపారు: TV9 రవిప్రకాశ్

స్వార్థ రాజకీయాలు ఏలుతున్న ఇటువంటి సందర్భంలో ప్రభుత్వాలు చేస్తున్న తప్పులును ప్రశ్నిస్తూ యువతకు స్పూర్తిని నింపుతున్న పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో మంచి అద్బుతమైన శక్తిగా ఎదగాలని TV9 రవిప్రకాశ్ కాటమరాయుడు ఫంక్షన్ లో అన్నారు
పూర్తి వివరాలు..

ఇది కౌరవ సభ :మైక్ ఇస్తే నిరూపిస్తా:జగన్

అగ్రిగోల్డ్ వ్యవహారంపై 20 నిమిషాలు మైక్ అడిగితే ఇవ్వలేదు20లక్షల మందికి టోపీ పెట్టి వేలకోట్లు మింగేసిన అతిపెద్ద స్కాంఆరోపణలు వచ్చినప్పుడు వినాలన్నా ఆరాటం కూడ లేదుఎంతసేపు టాపిక్ డైవర్ట్ చేయాలన్న ఆలోచనేఆస్తులను తన్నుకుపోయిన గద్దలమీద ఎంక్వైరీ జరగాలిడిపాజిట్ దారులకు న్యాయం చేయాలివైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ డిమాండ్ విజయవాడః ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న తీరు కౌరవసభ కన్నా దారుణంగా ఉందని, దే
పూర్తి వివరాలు..

గ్రాఫిక్స్ తో శాసనసభ సమయం వృధా: రోజా

అమరావతి:గ్రాఫిక్స్ తో రాజధాని నిర్మిస్తామని చెపుతున్న చంద్రబాబు రోజకో గ్రాఫిక్స్ తో అసెంబ్లీ ని నడుపుతూ శాసనసభా సమయాన్ని వృధా చేస్తున్నారని రోజా అన్నారు.రాజధాని నిర్మాణం లో చిత్తశుద్ధి లేదు కనుకనే కరకట్ట మీద టెంపరరీ గా అక్రమ నిర్మాణం లో ఉంటూ ప్రభుత్వం డబ్బులతో మరమ్మతులు చేయించి ఉంటున్నారు. హైదరాబాద్ లో మాత్రం సొంత ఇంటిని నిర్మించికుంటున్నారు. రాజధాని రైతులుకు ఇచ్చిన హామీలు గాని,లంక భూములు రై
పూర్తి వివరాలు..

సాక్షి రిపోర్టర్‌ ద్వారానే టెన్త్ పేపర్‌ బయటకు వచ్చింది: చంద్రబాబు

అమరావతి: సాక్షి పత్రిక రిపోర్టర్‌ ఫోన్‌ నెంబర్‌ ద్వారానే టెన్త్ పేపర్‌ బయటకు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. సాక్షి రిపోర్టర్‌కే పేపర్‌ లీకేజీ సమాచారం ఎలా తెలిసిందని చంద్రబాబు ప్రశ్నించారు. నాలుగు రోజులు వైసీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఉదయం10.35కి డీఈవోకు సాక్షి రిపోర్టర్
పూర్తి వివరాలు..

జగన్ బాత్ రూమ్ అంత లేదు మా ఆఫీసు:బిజెపి నేత విష్ణు కుమార్ రాజు

ఏ.పి అసెంబ్లీ లో BJPLP ఆఫీసు చాలా అసౌకర్యంగా ఉందని BJP నేత విష్ణు కుమార్ రాజు అన్నారు.ప్రతిపక్ష నేత జగన్ బాత్ రూమ్ అంత కూడా తమ ఆఫీసు లేదని ఆయన అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన వారిని అసెంబ్లీకి తీసుకునివద్దామనుకుంటే సిగ్గుగా ఉందని అన్నారు.తమకు పెద్ద రూమ్ కేటాయిస్తే అద్దె చెల్లిస్తామని అన్నారు.కాలేజిలలో,స్కూలులో మాదిరిగా అసెంబ్లీ కట్టినట్లుందని అన్నారు. ఆరుగురు మంత్రులుకు ఒక్క బాత్ రూమ్ ఇవ్వటం దారుణంగ
పూర్తి వివరాలు..

అగ్రిగోల్డ్ బాధితులకు పవన్ భరోసా

చట్టం బలవంతులకు బలహీనంగా......బలహీనులకు బలవంతంగా పని చేస్తుంది అని జనసేన నేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏజెంట్లుకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలి. లక్షల్లో బాధితులు ఏడుస్తుంటే నేతలు అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలనుకోవడం భాదాకరం. ఆస్తులను నేతలు దోచుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
పూర్తి వివరాలు..

మంత్రి వర్గ విస్తరణ కు కుదిరిన ముహుర్తం

అమరావతి: ఏప్రిల్ 2న ఏపీ మంత్రివర్గ విస్తరణ... ఉదయం 9.25 గంటలకు ముహూర్తం... సచివాలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమం...
పూర్తి వివరాలు..

ధూళిపాళ్ల భావోద్వేగం

మంత్రి పదవిని ఆశిస్తున్న టిడిపి ఎమ్మల్యే ధూళిపాళ్ల నరేంద్ర భావోద్వేగానికి గురయ్యారు.ఐదుసార్లు వరసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ ,జిల్లాలో పార్టీ జెండాను మోస్తూ వస్తున్నానని, తాను ఎప్పుడు పార్టీ అదినేతను పదవి కోసం ఇబ్బంది పెట్టలేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గతంలో అప్పటి మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఎదుర్కుని పార్టీని నిలబెట్టానని ధూళిపాళ్ల గుర్తు చేశారు. తకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ఆయన చంద్రబ
పూర్తి వివరాలు..

మంత్రివర్గంలో అవకాశం వీరికే..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి దాదాపు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. వారిలో చిత్తూరు నుంచి నారా లోకేశ్‌, శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు, విజయనగరం నుంచి సుజయ్‌కృష్ణ రంగారావు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి జవహర్‌, , గుంటూరు జిల్లా నుంచి నక్కా ఆనంద్‌బాబు, నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి అమర్‌నాథ్‌రెడ్డి, కడప జిల్లా నుంచి ఆదినార
పూర్తి వివరాలు..

మంత్రులకు శాఖలు ఖరారు

అమరావతి : మంత్రులకు శాఖలు ఖరారు నారాలోకేష్ - ఐటీ, పంచాయతీరాజ్ కళా వెంకట్ రావు -విద్యుత్ శాఖ పితాని సత్యనారాయణ- కార్మిక శాఖ సుజయ్ కృష్ణ రంగారావు - మైనింగ్ శాఖ కాల్వ శ్రీనివాసులు - రూరల్ హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ నక్కా ఆనంద్ బాబు - సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ భూమా అఖిల ప్రియ - టూరిజం శాఖ జవహార్ - ఎక్సైజ్ శాఖ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - వ్యవసాయశాఖ ఆదినారాయణ రెడ్డి - మార్కెట
పూర్తి వివరాలు..

రాష్ట్రపతి పదవి రేసులో లేను: అద్వానీ

న్యూఢిల్లీ:  రాష్ట్రపతి పదవిపై బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ  క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఆయన పార్లమెంట్‌ వెలుపల విలేకర్లతో మాట్లాడుతూ  రాష్ట్రపతి పదవి రేసులో తాను లేనని  స్పష్టం చేశారు.  కాగా ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం జూలై 24తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రణబ్‌ముఖర్జీ తర్వాత రాష్ట్రపతి పదవి... ఎవరిని వరించనున్నదనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.  గత కొంతకాలంగా ఈ ప
పూర్తి వివరాలు..

పుట్టినరోజున పర్యటించడం అనంతపురం జిల్లా ప్రజల అదృష్టం: రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 68 వ పుట్టినరోజున పర్యటించడం అనంతపురం జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు... మంత్రి కాలవ కామెంట్స్.... ®పేదప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం... ®ఆనంతజిల్లా పై ముఖ్యమంత్రి కి ఉన్న అభిమానం ఎనలేనిది.. ®ఈ జిల్లా పేద ప్రజలను ఆదుకోవాలనే తపన చంద్రబాబు కు ఉంది. ®అధికారం లోకి వచ్చిన 3 ఏ
పూర్తి వివరాలు..