Weekly News

బెంగుళూరు ఘటనపై బీజేపీ ఆందోళన

బెంగుళూరు ఘటనపై బీజేపీ ఆందోళనకు దిగింది. కర్నాటక సచివాలయం ముందు మహిళామోర్చా కార్యకర్తలు నిరసనకు దిగారు. రాష్ట్రంలో మహాళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. నిందితులకు కొందరు కాంగ్రెస్ నేతలు అండగా ఉన్నారని ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనపై కర్నాటక హోంమంత్రి పరమేశ్వరన్ స్పందించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని చెప్పిన ఆయన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. యువతులు అసభ్యంగా దుస్తులు ధరించడ
పూర్తి వివరాలు..

తప్పుడు పత్రాలు ఇస్తే జైలుకే

తప్పుడు ధృవపత్రాలతో సిమ్‌కార్డు తీసుకున్నా, విక్రయించినా బాధ్యులు ఇకపై జైలుకు వెళ్ళక తప్పదని కేంద్రం హెచ్చరించింది. ఉగ్రవాదులు, నేరగాళ్లు విచ్చలవిడిగా సిమ్స్ వాడుతుండటం, మెట్రో నగరాల్లో వేల సంఖ్యలో ప్రీ యాక్టివేటెడ్ కార్డ్స్ ఉన్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో కొత్త మార్గదర్శకాలను రూపొందించి.. కేంద్రం అన్ని రాష్ట్రాలకు పంపింది. దేశ భద్రతకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించి
పూర్తి వివరాలు..

అనుమతి లేకుండా అడుగుపెడితే జైలుకే

బెంగళూరులో ఇటీవల జరిగిన పలు ఘటనల నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కళాశాలల క్యాంపస్‌లలోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా క్యాంపస్‌లలోకి ఎవరైనా వస్తే జైలుపాలు కాక తప్పదని హెచ్చరించింది. అలాగే రాష్ట్రంలోని ప్రతి కళాశాల క్యాంపస్‌లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
పూర్తి వివరాలు..

ఉగ్రవాద దాడుల కోసం శిక్షణ

ఇండియాపై దాడులకు పాల్పడేందుకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం 20 మంది భారతీయులకు ఆఫ్ఘనిస్తాన్‌లో శిక్షణ ఇస్తున్నట్లు దేశీయ ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ నివేదికలో తెలిపాయి. కేరళ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు యువకులను నంగర్హార్ శిక్షణ శిబిరానికి తీసుకెళ్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.
పూర్తి వివరాలు..

టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

విశాఖ జిల్లా పెందుర్తిలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ తన స్థలం పక్కనే మరొకరి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నించారు. బాధితుడి స్థలంలో ఉన్న కట్టడాలను అతడి అనుచరులు కూల్చివేశారు. దీంతో గల్ఫ్ దేశంలో ఉన్న బాధితుడు ఈ మెయిల్ ద్వారా సీపీకి ఫిర్యాదు చేశాడు. గోవింద్, అతని కుమారుడు శ్రీకాంత్, పీఏ రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు
పూర్తి వివరాలు..