Weekly News

పుంజు బరిలోకి దిగుతుందా?

కోడిపుంజు అవాంతరాలన్నీ అధిగమించి బరిలోకి దిగుతుందా.. లేదా అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెర పడనుంది. పుంజును హైకోర్టు నిలువరించగా కేసు సుప్రీంకు చేరింది. దీనిపై రేపు మధ్యాహ్నం వాదనలు జరగనున్నాయి. కోడిపందేలపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ రఘు రామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్‌ను అత్యున్నత న్యాయ స్ధానం విచారణకు స్వీకరించింది. రేపు మధ్యాహ్నం వాదనలు వినిపించాల్సిందిగా సుప్రీం కోర్టు లాయర్లను క
పూర్తి వివరాలు..

పాక్ స్టార్ క్రికెటర్ అరుదైన రికార్డు

పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్ మెన్ యూనిస్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 11దేశాల్లో శతకాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా యూనిస్ ఈ ఘనతను సాధించాడు. టెస్టు హోదా లేని యూఏఈలో కూడ యూనిస్ సెంచరీ చేయగా.. అంతకుముందు 10టెస్టు హోదా కలిగిన దేశాల్లో రాహుల్ ద్రవిడ్ మాత్రమే సెంచరీలు సాధించాడు.
పూర్తి వివరాలు..

ధోని సాధించాల్సింది ఇంకా ఏమీ లేదు

టీ20, వన్డే కెప్టెన్సీకి ఎంఎస్ ధోనీ గుడ్ బై చెప్పడం సరైన నిర్ణయమేనని అతని భార్య సాక్షి సింగ్ అన్నారు. గత పదేళ్ల నుంచి తిరుగులేని టీమిండియా జట్టుకు కెప్టెన్‌గా ధోని.. ఇక అధిరోహించే శిఖరాలు ఏమీ లేవని చెప్పారు. అందుకే ధోనీని ఆపే ప్రయత్నం చేయలేదని, తన భర్త ఏ నిర్ణయం తీసుకున్నా ముందే ఆలోచించి తీసుకుంటాడని పేర్కొన్నారు.
పూర్తి వివరాలు..

టీ20 సిరీస్‌ న్యూజిలాండ్‌ కైవసం

న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ల మధ్య బే ఒవెల్‌ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్‌ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే న్యూజిలాండ్‌ దక్కించుకుంది. టాస్‌ గెలిచిన బంగ్లా జట్టు కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మున్రో అద్భుత శతకంతో రాణించాడు. 54 బంతుల్లో 101 పరుగులు చేయగా, బ్రూస్‌ 39 బంతుల్లో 59 పరుగులు చేశాడు. మిగిలిన బ
పూర్తి వివరాలు..

కోళ్ళను స్వాధీనం చేసుకోవద్దు: సుప్రీం

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో ఎక్కువగా నిర్వహించే కోడిపందేల సందర్భంగా కోళ్ళను పోలీసులు తీసుకెళ్ళడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోళ్ళను సీజ్ చేయవద్దని, వాటికి వాడే ఆయుధాలను మాత్రమే స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. కాగా కోడి పందేలు నిర్వహించరాదని హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు ఈ పిటిషన్ దాఖలు చేయగా.. తదుపరి విచారణను సుప్రీం 4వారాలకు వాయిదా వేసింది.


పూర్తి వివరాలు..

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లకు జట్టు ఎంపిక

ఇంగ్లాండ్‌తో జరిగే 3 వన్డేలు, T20లకు జట్టును BCCI ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా.. ధోనీ (కీపర్), రాహుల్, శిఖర్ ధవన్, మనీష్ పాండే, కేదర్ జాదవ్, యువరాజ్ సింగ్, రహానే, హార్థిక్ పాండ్య, అశ్విన్, జడేజా, మిశ్రా, బుమ్రా, భువనేశ్వర్, ఉమేష్ యాదవ్. టీ20: విరాట్ (కెప్టెన్), ధోనీ, మన్‌దీప్, యువరాజ్, KL రాహుల్, రైనా, రిషబ్ పంత్, పాండే, అశ్విన్, జడేజా, చాహల్, మనీష్ పాండే, బుమ్రా, భువనేశ్వర్, నెహ్రా.
పూర్తి వివరాలు..

యువీ రాకపై దాదా హర్షం

దాదాపు మూడేళ్ల తరువాత భారత వన్డే జట్టులోకి యువరాజ్ సింగ్ పునరాగమం చేస్తుండటంపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. వన్డే, T20లకు యువీ ఎంపిక సరైనదిగా పేర్కొన్న దాదా.. జట్టుకు ఇది మంచి పరిణామంగా పేర్కొన్నాడు. సెలక్టర్ల నమ్మకాన్ని యువరాజ్ నిలబెట్టుకుంటాడని, ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణిస్తాడని దాదా విశ్వాసం వ్యక్తం చేశాడు.
పూర్తి వివరాలు..

ఫైనల్‌కు దూసుకుపోయిన సానియా జోడీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌కు భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా జోడీ అడుగు దూరంలో నిలిచింది. మిక్సుడ్ డబుల్స్ సెమీ ఫైనల్లో స్టోసర్-గ్రోత్ జంటపై 6-4, 2-6, 10-5తేడాతో సానియా-ఇవాన్ దొడిగ్ ద్వయం విజయం సాధించి ఫైనల్‌కు దూసుకుపోయింది.
పూర్తి వివరాలు..