Weekly News

తిరుమలేశుడికి రూ.1018కోట్ల ఆదాయం

2016లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1018కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. 2015తో పోలిస్తే రూ.114కోట్ల ఎక్కువ ఆదాయం వచ్చిందని, ఒక్క డిసెంబర్‌లోనే అత్యధికంగా రూ.85కోట్ల ఆదాయం లభించినట్లు ఈఓ సాంబశివరావు తెలిపారు. 2016లో శ్రీవారిని 2కోట్ల 66లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, రికార్డు స్ధాయిలో 10కోట్ల 34లక్షల లడ్డూలు పంపిణీ చేసినట్లు చెప్పారు.
పూర్తి వివరాలు..

దేవుడా సమాంతరన్యాయం ఎక్కడ.?

దేవుడా సమాంతరన్యాయం ఎక్కడ.? మంగళగరి లో నీవు ఎక్కడ..? పాస్ లు లేవు కాని పేస్ వాల్యు పనిచేస్తుంది..! డబ్బులు పెట్టి టికెట్ కొనక్కర్లాదు అధికార దర్పం పనిచేస్తుంది..! గంటల కొద్ద క్యూలైన్ లో నిలబడక్కర్లేదు బందగణం తోడ్పడుతుంది..! తీర్థం తీర్ధంలాగా పుచ్చుకోనక్కర్లేదు.. అయినవారు బాటిల్ తో సంతోషపరుస్తున్నారు ..!
పూర్తి వివరాలు..

ముక్కోటి ఏకాదశి

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గ
పూర్తి వివరాలు..

కనులవిందుగా మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి

మంగళగిరి:వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి భక్తులను ఆకట్టుకుంటున్నారు
పూర్తి వివరాలు..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజ్‌నాథ్

తిరుమల వెంకన్నను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు రాజ్‌నాథ్‌ను శేషవస్త్రంతో సత్కరించి తీర్ధప్రసాదాలు అందజేశారు
పూర్తి వివరాలు..

మహానందిలో వైయస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం మహానందీశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ప్రతిపక్ష నేతకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు.
పూర్తి వివరాలు..

క‌న్యాకుమారి, ఢిల్లీలో రూ.55 కోట్ల‌తో వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యాలు: టీటీడీ చైర్మ‌న్ చ‌ద‌ల‌వాడ‌

టీటీడీ ఆధ్వ‌ర్యంలో క‌న్యాకుమారి, ఢిల్లీ స‌మీపంలో రూ.55 కోట్ల‌తో క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యాల‌ను నిర్మించ‌నున్న‌ట్టు టీటీడీ చైర్మ‌న్ చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి తెలిపారు. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వ‌స్తున్న భ‌క్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంద‌న్నారు. భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, సామాన్య భ‌క్తుల ద‌ర్శ‌నానికే అధిక ప్రాధాన్యం ఇస్తున
పూర్తి వివరాలు..