Weekly News

స్పష్టతనిచ్చిన ఆర్‌బీఐ

డిసెంబర్‌ 30 నాటికి రద్దయిన పెద్దనోట్లు 97శాతం మేర బ్యాంకుల్లో జమ అయ్యాయంటూ వస్తున్న వార్తలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పందించింది. ఇప్పటి వరకు తామెలాంటి అధికారిక ప్రకటనా చేయలేదని, వీలైనంత తొందర్లో ఆ వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది. కాగా, డిసెంబర్‌ 30 నాటికి రూ.14.5 నుంచి రూ.15లక్షలు కోట్ల మేర పాత నోట్లు జమ అయినట్లు ఓ వార్తా సంస్థ కథనం వెలువరించింది. దీనిపై ఈ రోజు ఆర్థికమంత్రి అ
పూర్తి వివరాలు..

డిజిటల్ హెల్ప్ లైన్ వచ్చేసింది!

డిజిటల్ లావాదేవీలపై వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 14444ను ప్రారంభించింది. కేంద్రం, టెలికం, ఐటీ శాఖలు కలిసి సంయుక్తంగా దీన్ని నిర్వహించనుండగా.. ప్రస్తుతానికి ఇది కేవలం ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే దేశంలోని అన్ని భాషల్లో.. అన్ని రాష్ట్రాల్లో దీనిని తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
పూర్తి వివరాలు..

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో సాగుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో 100పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్.. కాసేపటి క్రితం 176పాయింట్లు పుంజుకుని 26,810వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 59పాయింట్ల లాభంతో 8,249వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఆటో రంగ షేర్లు లాభాల్లో.. టెలికం రంగం షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.68.05గా ఉంది.
పూర్తి వివరాలు..

మిగిలింది రూ.50వేల కోట్లేనా!

‌డీమోనిటైజేషన్‌తో రూ.15.4లక్షల కోట్ల విలువైన రూ. వెయ్యి, రూ.500 నోట్లు రద్దు కాగా.. వీటిలో రూ.14.5లక్షల కోట్లు ఆర్బీఐకి తిరిగి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి మిగిలింది కేవలం రూ.50వేల కోట్లు మాత్రమేనట. కాగా రద్దైన నోట్లు RBIకి చేరని మొత్తం విలువను మిగులుగా భావించి ప్రభుత్వం వాటిని వినియోగిస్తుంది. అటు బ్యాంకుల‌కు చేరిన పాత నోట్లపై కేంద్రం త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.
పూర్తి వివరాలు..

కొన్ని వింత విషయాలు

☞ దేశంలోని అతిపెద్ద జలపాతం కర్ణాటకలోని జోగ్‌ఫాల్స్ (830 అడుగులు) ☞ నోబెల్ బహుమతులను 18 క్యారెట్ల పచ్చబంగారంతో తయారుచేసి దానిపై 24 క్యారెట్ల బంగారుపూత పూస్తారు ☞ కనుబొమ్మల మధ్య ప్రదేశాన్నిగ్లాబెల్లా అంటారు ☞ కప్పలు నోటి ద్వారా కాకుండా చర్మం ద్వారా నీటిని గ్రహిస్తాయి ☞ జెండా కర్రపై ఉండే బొడిపెను ట్రక్ అంటారు


పూర్తి వివరాలు..

పెద్దనోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం: ప్రణబ్

పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్ధిక వ్యవస్థ తాత్కాలికంగా మందగించే అవకాశం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ అన్నారు. నల్లధనాన్ని అరికట్టడం, అవినీతిపై పోరాటం కోసం తీసుకున్న ఈ నిర్ణయంతో కొన్ని ఇబ్బందులు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పేదలు తీవ్ర ఇబ్బందులపాలు కాకుండా కేంద్రం జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రభుత్వం దీర్ఘకాలంలో అంచనా వేస్తున్న ఫలితాలు రావాలంటే ప్రజలు కొంత ఓపిక వహించాలని ఆయన పేర్కొన్నారు.
పూర్తి వివరాలు..

అంబానీకి షాకిచ్చిన సుప్రీం

ఎయిర్ సెల్ మాక్సిస్ 2జీ స్పెక్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఆర్ కాం కి షాకిచ్చింది. మలేషియా కంపెనీ మాక్సిస్ నుంచి 2 జి లైసెన్స్ ను మరో టెలికం కంపెనీ బదిలీ చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్, భారతి ఎయిర్ టెల్ మధ్య జరిగిన ఒప్పందంపై సుప్రీంకోర్టు ష్టే విధించింది. ఈ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం నిందితులపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు న
పూర్తి వివరాలు..

జియో, ఎయిర్ టెల్ దారిలో వోఢాఫోన్,ఉచిత ఆఫర్లను ప్రకటించిన వోఢాఫోన్

టెలికం కంపెనీలు పోటీలు పడి వినియోగదారులకు భారీ ఆపర్లను ప్రకటిస్తున్నాయి. జియో ఉచిత ఇంటర్నెట్, కాల్స్ సేవల నేపథ్యంలో ఎయిర్ టెల్ కూడ ఇదే బాటలో నడిచింది. ఈ రెండు కంపెనీల బాటలో వోడాపోన్ ను కూడ నడవనుంది. ఈ మేరకు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ల టారిఫ్ లను మార్చింది. జియో తన సేవలను ఈ ఏడాది మార్చివరకు ఉచితంగా వినియోగదారులకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దరిమిలా ఎయిర్ టెట్ కూడ తన ప్యాకేజీల్లో మార్పులు చేర్పు చేసింద
పూర్తి వివరాలు..

రైలు టికెట్ల ధరకే విమాన టికెట్లు!

న్యూఢిల్లీ ఎయిరిండియా ఒక్కసారిగా విమానటికెట్ల ధరలను తగ్గించింది. రిపబ్లిక్ డే ఆఫర్ కింద ఏకంగా రైలు టికెట్ల ధరలకే విమానటికెట్లను అందిస్తామని ఊరిస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ టూటైర్ టికెట్ల ధరలకు స్వదేశీ రూట్లలో ఎకానమీ క్లాస్ టికెట్లు ఇవ్వబోతోంది. ఈ ఆఫర్ కింద జనవరి 26 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ప్రయాణాలు చేయొచ్చు. ఏప్రిల్ పదో తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే,
పూర్తి వివరాలు..

ఎయిరిండియా సంచలన ఆఫర్‌ ప్రారంభం

దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా సంచలన ఆఫర్‌ ప్రకటించింది. మూణ్నెళ్ల కాలపరిమితిపై టిక్కెట్లు బుక్‌ చేసుకొనేవారికి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో సెకండ్‌ ఏసీ టికెట్‌తో సమానంగా విమాన టికెట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు రూ.1080 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇది శుక్రవారం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జనవరి 6 నుంచి ఏప్రిల్‌ 10 మధ
పూర్తి వివరాలు..

భవన అంతస్థుల పరిమితిపై ఉపశమనం

అమరావతి పరిసరాల్లో భవనాల అంతస్థులపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అమరావతి పరిధిలో 40 అంతస్థులు, విజయవాడలో 20 అంతస్థుల వరకు సీఆర్డీఏ అనుమతితో కట్టుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్త రాజధాని నిర్మాణంతో ఏర్పడే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటివరకు అమరావతిలో సాధారణ భవన నిర్మాణ పరిమితి 6 అంతస్థులుగా ఉంది. ఇంతకు ఎక్కువైతే చెన్నైలోని అథారిటీ అనుమతి తప్
పూర్తి వివరాలు..

పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి : యనమల

నవ్యాంధ్ర రాజధాని అమరావతి సచివాలయంలో రెండో రోజు ప్రీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పలు శాఖలతో చర్చించిన మంత్రి యనమల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి.. నిత్యం రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాలు వస్తాయన్నారు. అటు కాలుష్య రహిత పరిశ్రమలకు తాము ప్రాధాన్యత ఇస్తామన్న మంత్రి.. నాలా పన్ను వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తామన్నారు.
పూర్తి వివరాలు..

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం 131 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. 241 పాయింట్లు లాభపడి రెండు నెలల గరిష్ఠానికి చేరి 27,140 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 8,380 వద్ద ట్రేడ్ ముగించింది. కాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.68.29గా ఉంది.
పూర్తి వివరాలు..

రాష్ట్రానికి చంద్రబాబే ఐకాన్: GMR

ఏపీకి చంద్రబాబే ఐకాన్ అని పారిశ్రామికవేత్త గ్రంథి మల్లిఖార్జునరావు అన్నారు. రాష్ట్రం కోసం సీఎం పడుతున్న కష్టాన్ని అంతా మెచ్చుకోవాలి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. అటు బాబు చూపించిన చలవే తమను ఈ స్థాయిలో నిలబెట్టిందని.. ఆయన హాయాంలో నిర్మించిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఇప్పటికీ ది బెస్ట్ అని GMR పేర్కొన్నారు. ప్రభుత్వం APని మినీ సింగపూర్‌గా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలు..

పెరిగిన మారుతీ కార్ల ధరలు

మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ కార్ల ధరలను పెంచేసింది. అన్ని మోడళ్లపై రూ. 1500 నుండి రూ.8014 వరకు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. కమోడిటి, ట్రాన్స్ పోర్టేషన్, అడ్మినిస్ట్రేటివ్ ధరలు పెరగడంతో ధరలను పెంచినట్లు తెలిపింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. హ్యాచ్ బ్యాక్ ఆల్టో 800 నుంచి ప్రీమియం క్రాస్ ఓవర్ ఎస్-క్రాస్ వరకు పలు రకాల కార్లను కంపెనీ విక్రయిస్తోంది.
పూర్తి వివరాలు..