Weekly News

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల: ఏప్రిల్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. 50,974 ఆర్జిత సేవ టికెట్లను టీటీడీ వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచారు. నిత్య సేవలతో పాటు వారపు సేవా టికెట్లను భక్తులు వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లను ప్రతి నెలా మొదటి శుక్రవారం టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచుతోంది. ఆర్జిత సేవా టిక్కెట్ల వివరాలు అర్చన - 6120 తోమాల - 120 సుప్రభాతం - 6000
పూర్తి వివరాలు..

జల్లికట్టు నిర్వహించేలా ఆర్డినెన్స్ తీసుకురండి:ప్రధాని కి తమిళనాడు ముఖ్యమంత్రి వినతి

జల్లికట్టును నిర్వహించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయ క్రీడను కొనసాగించాలని.. సంక్రాంతి పండుగకు కూడా సమయం దగ్గర పడుతుందని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా ఇటీవల జల్లికట్టుపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలు..