Weekly News

తాజా క్రైమ్ న్యూస్ వార్తలు

05-01-2017 83

బెంగుళూరు ఘటనపై బీజేపీ ఆందోళన

బెంగుళూరు ఘటనపై బీజేపీ ఆందోళనకు దిగింది. కర్నాటక సచివాలయం ముందు మహిళామోర్చా కార్యకర్తలు నిరసనకు దిగారు. రాష్ట్రంలో మహాళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. నిందితులకు కొందరు కాంగ్రెస్ నేతలు అండగా ఉన్నారని ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనపై కర్నాటక హోంమంత్రి పరమేశ్వరన్ స్పందించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని చెప్పి
పూర్తి వివరాలు..
05-01-2017 103

తప్పుడు పత్రాలు ఇస్తే జైలుకే

తప్పుడు ధృవపత్రాలతో సిమ్‌కార్డు తీసుకున్నా, విక్రయించినా బాధ్యులు ఇకపై జైలుకు వెళ్ళక తప్పదని కేంద్రం హెచ్చరించింది. ఉగ్రవాదులు, నేరగాళ్లు విచ్చలవిడిగా సిమ్స్ వాడుతుండటం, మెట్రో నగరాల్లో వేల సంఖ్యలో ప్రీ యాక్టివేటెడ్ కార్డ్స్ ఉన్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో కొత్త మార్గదర్శకాలను రూపొందించి.. కేంద్రం అన్ని రాష్ట్ర
పూర్తి వివరాలు..

06-01-2017 137

అనుమతి లేకుండా అడుగుపెడితే జైలుకే

బెంగళూరులో ఇటీవల జరిగిన పలు ఘటనల నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కళాశాలల క్యాంపస్‌లలోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా క్యాంపస్‌లలోకి ఎవరైనా వస్తే జైలుపాలు కాక తప్పదని హెచ్చరించింది. అలాగే రాష్ట్రంలోని ప్రతి కళాశాల క్యాంపస్‌లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా
పూర్తి వివరాలు..
07-01-2017 178

ఉగ్రవాద దాడుల కోసం శిక్షణ

ఇండియాపై దాడులకు పాల్పడేందుకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం 20 మంది భారతీయులకు ఆఫ్ఘనిస్తాన్‌లో శిక్షణ ఇస్తున్నట్లు దేశీయ ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ నివేదికలో తెలిపాయి. కేరళ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు యువకులను నంగర్హార్ శిక్షణ శిబిరానికి తీసుకెళ్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారుల
పూర్తి వివరాలు..
10-01-2017 276

టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

విశాఖ జిల్లా పెందుర్తిలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ తన స్థలం పక్కనే మరొకరి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నించారు. బాధితుడి స్థలంలో ఉన్న కట్టడాలను అతడి అనుచరులు కూల్చివేశారు. దీంతో గల్ఫ్ దేశంలో ఉన్న బాధితుడు ఈ మెయిల్ ద్వారా సీపీకి ఫిర్యాదు చేశాడు. గోవింద్, అతని కుమార
పూర్తి వివరాలు..
22-01-2017 306

రైలు ప్రమాదం వెనక కుట్ర?

విజయనగరం జిల్లా కూనేరు వద్ద జరిగిన హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో కుట్ర కోణం దాగి ఉన్నట్లు రైల్వే వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని అభిప్రాయపడుతున్నాయి. గణతంత్ర దినోత్సవం దగ్గర పడుతున్నందున తమ ఉనికి చాటుకునేందుకు నక్సల్స్ ఈ ద
పూర్తి వివరాలు..